Megha Infrastructure: రాజకీయ పార్టీలకు విరాళాల్లో మేఘా ఫస్ట్ ప్లేస్.. అవినీతి సొమ్మును కాపాడుకోవడానికేనా?

ఇటీవల మేడిగడ్డ బారేజ్ కుంగిన ఘటనలో తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మేఘా సంస్థ.. 2022-23 ఏడాదికి గానూ అత్యధికంగా రాజకీయ పార్టీలకు ఫండింగ్ చేసిన కంపెనీల్లో మొదటి స్థానంలో ఉంది. తమ అవినీతి బయటకు రాకుండా కాపాడుకోవడం కోసమే ఈ ఫండింగ్ అన్న ఆరోపణలు ఉన్నాయి.

New Update
Megha Infrastructure: రాజకీయ పార్టీలకు విరాళాల్లో మేఘా ఫస్ట్ ప్లేస్.. అవినీతి సొమ్మును కాపాడుకోవడానికేనా?

కాళేశ్వరం ప్రాజెక్టులో (Kaleshwaram Project) 40 వేల కోట్లు స్వాహా చేశారని విమర్శలు ఎదుర్కుంటున్న వ్యక్తి.. తెలంగాణ ప్రాజెక్టు కాంట్రాక్టుల్లో 70 వేల కోట్లు అవినీతికి పాల్పడినట్టు అటు అధికారపక్షం ఇటు ప్రతిపక్షం నుంచి ఆరోపణలు ఎదుర్కుంటున్న కాంట్రాక్టర్. అతనే మేఘా ఇంజనీరింగ్ కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి... ఈ తరుణంలో గత ఎన్నికల్లో అధికార పార్టీలకు ఆయన ఇచ్చిన విరాళాలు ఖంగుతినిపిస్తున్నాయి. అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్స్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌ ) తాజా నివేదికలో ఓ ఆసక్తికర అంశం బయటపడింది. వివిధ పార్టీలకు ఆయా సంస్థలు ఇచ్చిన విరాళాల్లో మేఘా ఇంజనీరింగ్ కంపెనీదే అత్యధిక వాటా. అయితే వేల కోట్ల ప్రజాధనం బొక్కి అందులో కొంత అధికార పార్టీలకు విరాళాలు ఇస్తున్న ఈ కాంట్రాక్టర్ పై సీబీఐ విచారణ జరుగుతుందా..? బీజేపీ- కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నట్టు అవినీతి సొమ్ము కక్కించడం సాధ్యమేనా అనే చర్చ జరుగుతోంది.

కాళేశ్వరంలో 30 శాతానికి పైగా అవినీతి..
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయంలో 30శాతంపైగా అవినీతి జరిగిందని ఇప్పటికే ప్రధాన పార్టీలు విమర్శిస్తున్నారు. దోపిడీ కోసమే రీడిజైనింగ్ పేరుతో మేఘా కంపెనీకి లక్షల కోట్ల రూపాయల విలువైన కాళేశ్వరం ప్రాజెక్టును కట్టబెట్టారంటూ మొదట్నుంచీ కాంగ్రెస్ పార్టీ సహా ఆయా పార్టీలు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పై, మేఘా ఇంజనీరింగ్ సంస్థపై దుమ్మెత్తిపోస్తూనే ఉన్నాయి. ఆ మధ్య వెలువడిన ఫోర్బ్స్ జాబితా చూస్తుంటే అది నిజమేనేమో అనిపించక మానదు... ఎందుకంటే, ఈ ప్రాజెక్టు చేపట్టిన తర్వాతే మేఘా కంపెనీ విలువ అమాంతం పెరిగింది. దేశ అత్యంత ధనవంతుల జాబితాలో మేఘా ఫ్యామిలీ ఏకంగా 39వ స్థానానికి ఎగబాకింది. దాంతో కాళేశ్వరంలో తిన్న సొమ్మంతా కక్కించాలని మేఘా వ్యతిరేక వర్గం కోరుకుంటోంది. ఇత పెద్ద మొత్తంలో ప్రజా సొమ్ము తిన్ని పార్టీలకు ధారదత్తం చేయడం వెనక ఆయన స్వప్రయోజనం ఉందనేది రాజకీయ విశ్లేషకుల మాట.

మొత్తం 87 కోట్లు..
రాజకీయ పార్టీలకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా విరాళాలు ఇచ్చిన కార్పొరేట్‌ సంస్థల్లో మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఎలక్టోరల్‌ ట్రస్టుల ద్వారా మేఘా సంస్థ 87 కోట్లు పార్టీలకు విరాళాల రూపంలో ఇచ్చింది. ఈ విషయంలో మేఘా తర్వాతి స్థానాల్లో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ 50.25 కోట్లు, ఆర్సెలర్‌ మిత్తల్‌ నిహోన్‌ స్టీల్‌ ఇండియా 50 కోట్లు విరాళాల రూపంలో ఇచ్చింది. అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్స్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) తన తాజా నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. ఒకే ఒక్క కాళేశ్వరంతో మేఘా కంపెనీ ఫోర్బ్స్ జాబితా ఎక్కడం.. ఆ తర్వాత తాజాగా పార్టీ విరాళాల్లో కూడా ఆ కంపెనీ టాప్ రావడం ఆశ్చర్యం అనిపించక మానదు. మేఘా సంస్ధ ఇచ్చిన విరాళాల్లో అధికార పార్టీలే ఉండటం విశేషం.. బీజేపీ, బిఆర్ఎస్, వైసీపీలకు విరాళాల రూపంలో పెద్ద మొత్తాన్నే కట్టబెట్టిందని చెప్పాలి.. గతంలో 2020లో సైతం వైసీపీకి 5 కోట్ల చెక్ ను అందించారు కృష్ణారెడ్డి.

కాంగ్రెస్ ఆ మాట నిలబెట్టుకుంటుందా?
మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా వినిపించే పేరు మేఘా కృష్ణారెడ్డి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ గా ఉన్నప్పుడు గానీ రాష్ట్ర విభజన అనంతరం గానీ అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ పాలకుల కన్ను కాంట్రాక్టర్ మేగా కృష్ణారెడ్డిపైనే ఉండేది. ఆయనకు చెందిన మేఘా ఇంజనీరింగ్ సంస్థే రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలకులు ఎవరైనా కోట్లాది రూపాయల కాంట్రాక్ట్ పనులను చేజిక్కించు కొంటోంది. అయితే ఆయన చేపట్టిన ప్రతి ప్రాజెక్టులోనూ అవినీతి ఆరోపణలు వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా కాంగ్రెస్ లోకి అధికారంలోకి రాగానే... న్యాయవాది రాపోలు భాస్కర్ కాళేశ్వరం అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సైతం కాళేశ్వరం లో జరిగిన అవినీతి, ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరుతో మేఘా సంస్థ జరిపిన దోపిడిపై విచారణ జరిపిస్తామని పదేపదే చెప్పుకొచ్చింది. ఇప్పుడు మరి కాంగ్రెస్ ఆ మాట నిలబెట్టుకుంటుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది.

రాజకీయ పార్టీలకు విరాళాలు వివిధ కంపెనీల నుంచి అందిన విరాళాల వివరాలను అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్స్‌ రిఫార్మ్స్‌ - ఏడీఆర్‌ తన నివేదిక ద్వారా ప్రకటించింది. ఈ నివేదిక ప్రకారం రాజకీయ పార్టీలకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా విరాళాలు ఇచ్చిన కార్పొరేట్‌ సంస్థల్లో మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఎలక్టోరల్‌ ట్రస్టుల ద్వారా మేఘా సంస్థ 87 కోట్లు పార్టీలకు విరాళాల రూపంలో ఇచ్చింది. అంతేకాదు రాజకీయ పార్టీలకు అత్యధిక విరాళిచ్చిన మూడు కంపెనీలు కూడా హైదరాబాద్‌కు చెందినవే కావడం గమనార్హం. మెఘా తర్వాత స్థానంలో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ 50.25 కోట్లు, ఆర్సెలర్‌ మిత్తల్‌ నిహోన్‌ స్టీల్‌ ఇండియా 50 కోట్లు విరాళాలు ఇచ్చాయి.  విరాళాలు ఇచ్చే వ్యక్తులు/సంస్థలకు.. రాజకీయ పార్టీలకు నడుమ అనుసంధానకర్తగా వ్యవహరించే ఎలక్టోరల్‌ ట్రస్టుల ద్వారా మేఘా సంస్థ మొత్తం 87 కోట్లు పార్టీలకు విరాళాల రూపంలో ఇచ్చింది.

Also read:నిన్న సిరాజ్…ఇవాళ బుమ్రా..ఇండియా టార్గెట్ 79 రన్స్

దేశంలో మొత్తం 18 రిజిస్టర్డ్‌ ఎలక్టోరల్‌ ట్రస్టులు ఉండగా.. వాటిలో 13 ట్రస్టుల వివరాలే ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఎనిమిదింటికి అసలు ఏ విరాళాలూ అందలేదు. మిగతా ఐదింటికీ కలిపి 39 కార్పొరేట్‌, వ్యాపార సంస్థలు 363.71 కోట్లు ఇచ్చాయి. ఇందులో ఫ్రుడెంట్ ట్రస్ట్ తనకు అందిన 360.46 కోట్లలో 256.25 కోట్లను బీజేపీకి ఇచ్చేయడం విశేషం. ఫ్రుడెంట్ ట్రస్ట్ బీజేపీతో పాటూ ఆప్‌, బీఆర్‌ఎస్‌, వైసీపీలకు కూడా విరాళాలు ఇచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అన్నింటికంటే ఎక్కువగా బీజేపీకే ఎక్కవ విరాళాలు వచ్చాయి. అన్న ఎలక్టోరల్ ట్రస్ట్‌ల నుంచి కలిపి రూ.259 కోట్లు విరాళాలు అందుకుంది బీజేపీ. ఇక వైసీపీ, ఆప్, కాంగ్రెస్ మూడూ కలిపి 17.40 కోట్ల విరాళాలను అందుకుంది.

బీజేపీ నంబర్.1 స్థానంలో..
34 కార్పొరేట్, వ్యాపార సంస్థలు ‘ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్‌’కు రూ.360 కోట్లకు పైగా, సమాజ్ ఎలక్టోరల్ ట్రస్ట్‌కు ఒక కంపెనీ 2 కోట్లు, పరిబర్తన్ ఎలక్టోరల్ ట్రస్ట్‌కు 2 కంపెనీలు 75.50 లక్షలు, ట్రింప్ ఎలక్టోరల్ ట్రస్ట్‌కు 2 కంపెనీలు 50 లక్షలు విరాళంగా అందించినట్టు ఏడీఆర్ రిపోర్టు పేర్కొంది. మొత్తంగా గతంతో పోలిస్తే... మేఘా సంస్థ 87 కోట్ల విరాళంతో టాప్ లో నిలిచిందనే చెప్పాలి. ఇక అత్యధికంగా విరాళాలు అందుకున్న పార్టీగా బీజేపీ నంబర్ వన్ స్థానంలో ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు