మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి సందడి షురూ అయ్యింది. జూన్ 9న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ ఎంగేజ్మెంట్ జరగింది. అప్పటి నుంచి వారు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారా అని మెగా అభిమానులు తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి నవంబర్ 1న శుభ ముహూరతం కుదిరినట్లు సమాచారం. వరుణ్ లావణ్యలు డెస్టినేషన్ వెడ్డింగ్‌కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటలీలోని ఓ ప్యాలెస్‌లో వీరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వరుణ్- లావణ్య తమ పెళ్లి పనుల్లో మునిగిపోయారు. హైదరాబాద్లోని ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా షో రూంలో ఈ జంట సందడి చేసింది. పెళ్లి షాపింగ్ కోసం వీరు అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. పెళ్లికి సంబంధించిన డ్రెస్సులను మనీష్ మల్హోత్రాతో ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటున్నారట. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
2017లో వచ్చిన మిస్టర్ సినిమాతో మొదలైన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. అంతరిక్షం సినిమా సమయంలో వారిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత చాలా పార్టీల్లో ఈ లవ్ బర్డ్స్ జంటగా కనిపించారు. కానీ బయట కలిసి కనిపించింది చాలా తక్కువే. కాగా వరుణ్ తేజ్ ఇటీవలే గాండీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ప్రస్తుతం వరుణ్ ఓ కొత్త దర్శకుడుని పరిచయం చేస్తూ ఆపరేషన్ వాలెంటైన్ అనే ఏయిర్ ఫోర్స్ బ్యాక్‌గ్రాప్‌లో సినిమా చేస్తున్నాడు. ఇక లావణ్య థనల్ అనే తమిళ సినిమా చేస్తుంది. అథర్వ మురళి హీరోగా నటిస్తున్న ఈ సినిమాను రవింద్ర మాధవ డైరెక్ట్ చేస్తున్నాడు.
The wedding prep begins for the Mega Wedding❤️🔥
Mega Prince #VarunTej & #LavanyaTripathi Spotted at @MMalhotraworld for their wedding outfit trails, Specially designed by @ManishMalhotra💥@IAmVarunTej @Itslavanya #VarunLav pic.twitter.com/r8fjtsypOe
— Varun Tej Fans (@VarunTejFans) September 16, 2023