Machilipatnam : అది 2014.. మచిలీపట్నం.. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) బహిరంగ సభలో మాట్లాడుతుండగా ఆయనపై కోడి గుడ్లతో దాడి జరిగింది.. ఈ గుడ్లు విసిరిన వారిలో బీజేపీ(BJP) కార్యకర్తలతో పాటు పవన్ ఫ్యాన్స్ కూడా ఉన్నారన్న వార్తలు గుప్పుమన్నాయి.. చిరంజీవి బాధపడ్డారు.. సీన్ కట్ చేస్తే 2024.. పవన్(Pawan) కోసం చిరంజీవి నడుంబిగించారు.. తమ్ముడిని గెలిపించాలని కోరారు.. మోదీని హిట్లర్‌తో పోల్చిన చిరంజీవి ఇప్పుడు అదే మోదీకి ఓటు మద్దతు ఇవ్వమని పరోక్షంగా అడుగుతున్నారు.. అటు 'చెప్పను బ్రదర్' అంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్‌తో కయ్యానికి దిగిన నాటి అల్లు అర్జున్.. ఇప్పుడు పవన్ వెంట నడుస్తున్నట్టు ప్రకటించారు.. ఇలా మెగా కుటుంబమంతా ఏకతాటిపైకి వచ్చి ఏళ్లు దాటింది.. ఇంతకీ ఈ దశాబ్ద కాలంలో ఏం జరిగింది? మెగా కుటుంబమంతా ఒకే వాయిస్ వినిపించడానికి కారణమేంటో తెలుసుకుందాం!
టాలీవుడ్(Tollywood) లో మెగా కుటుంబానికి ప్రత్యేక స్థానం. సినీ ఇండిస్ట్రీని దశబ్దాలుగా ఏలుతున్న కుటుంబం కూడా ఇదే. తెలుగు హీరోల్లో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న ఘనత మెగా కుటుంబానికి చెందిన నటుడిదే. అయితే ఫ్యామిలీ అన్నాక అలకలు సర్వసాధారణం.. మెగా కుటుంబలోనూ ఇలాంటి అలకలు ఉన్నాయి. అవి ఒక సమయంలో పవన్ వర్సెస్ చిరంజీవి.. మరొక సమయంలో పవన్ వర్సెస్ అల్లు అర్జున్‌గా కనిపించాయి. అయితే 2024 ఎన్నికలు మెగా కుటుంబం మొత్తాన్ని ఒకతాటిపైకి తీసుకొచ్చాయి. ఒక్కొక్కరుగా అందరూ పవన్‌కు మద్దతు ప్రకటిస్తున్నారు.. వరుణ్‌తేజ్, చిరంజీవి, అల్లు అర్జున్ ఇలా ప్రతీ ఒక్కరు పవన్‌కు సపోర్ట్ ఇచ్చారు. ఇది మెగా అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది.
చెప్పను బ్రదర్ అనగానే ఎవరికైనా అల్లు అర్జునే(Allu Arjun) గుర్తొస్తాడు. ఈ డైలాగ్ అప్పట్లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. 2016లో అల్లు అర్జున్ హీరోగా నటించిన 'సరైనోడు' బ్లాక్ బస్టర్ ఫంక్షన్ విజయవాడలో జరిగింది. అప్పట్లో ఓ ట్రెండ్ నడిచింది. సినిమాలకు సంబంధించిన ఈవెంట్లలో పవన్ ఫ్యాన్స్ 'పవర్ స్టార్ పవన్ స్టార్' అని నినాదాలు చేసేవారు. దీనిపై నాగబాబు సైతం అప్పట్లో చాలా సీరియస్ అయ్యారు. ఇటు 'సరైనోడు' సక్సెస్ ఈవెంట్‌లో బన్నీ మాట్లాడుతున్న సమయంలోనూ పవన్ ఫ్యాన్స్ ఇలానే నినాదాలు చేశారు. దీనికి కౌంటర్‌గా బన్నీ 'చెప్పను బ్రదర్' అని డైలాగ్ పేల్చాడు. ఈ ఒక్క మాటతో పవన్ ఫ్యాన్స్ అల్లు అర్జున్‌కు వ్యతిరేకంగా మారిపోయారంటారు సినీ ఎక్స్‌పర్ట్స్!
అటు 2014 ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీ-బీజేపీ కూటమి తరుఫున ప్రచారం చేసింది. అప్పుడు చిరంజీవి కాంగ్రెస్ వైపు ఉన్నారు. పవన్ మోదీకి సపోర్ట్ చేయడాన్ని చిరంజీవి తీవ్రంగా వ్యతిరేకించారు. మోదీని హిట్లర్ అని, నిరంకుశుడు అని కామెంట్స్ చేశారు. బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని మండిపడ్డారు చిరంజీవి. ఈ కామెంట్స్ పెను దుమారాన్నే రేపాయి. చిరంజీవి మచిలీపట్నం సభలో ఉండగా ఆయనపై కోడి గుడ్లతో దాడి జరిగింది. పవన్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉండే మచిలీపట్నంలో ఈ దాడి జరగడం సంచలనం రేపింది.
నిజానికి మెగా ఫ్యామిలీ అంతా ఓకే తాటిపైకి ఉన్నట్టు కనిపిస్తుంది కానీ.. రియాల్టీలో మాత్రం జరిగేది వేరన్న భావన ఫ్యాన్స్‌లో ఉంటుంది. మెగా వృక్షానికి బీటలు వారి ఏళ్లు గడుస్తోంది. అయితే ఎన్నికల వేళ ఆ బీటలు కనపడకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే మెగా ఫ్యామిలీ మొత్తం పవన్‌కు అండగా నిలుస్తోంది. ఏది ఏమైనా చిరంజీవి నుంచి అల్లు అర్జున్ వరకు అంతా పవన్ వైపే ఉండడం జనసేన కార్యకర్తల్లో కొత్త జోష్ నింపింది.
Also read: బాబాయ్ కోసం అబ్బాయి…పిఠాపురానికి చరణ్!