Crime News : కిర్గిస్థాన్‌లో విషాదం.. జలపాతంలో పడి ఏపీ విద్యార్థి మృతి

కిర్గిస్థాన్‌లో విషాద జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దాసరి చందు(21) అనే ఎంబీబీఎస్ విద్యార్థి జలపాతంలో పడి మృతి చెందాడు. చందు మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కర్గిస్థాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అతడి తల్లిదండ్రులు తెలిపారు.

New Update
Crime News : కిర్గిస్థాన్‌లో విషాదం.. జలపాతంలో పడి ఏపీ విద్యార్థి మృతి

Kyrgyzstan :  కిర్గిస్థాన్‌లో విషాద జరిగింది. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) కు చెందిన దాసరి చందు(Dasari Chandu) (21) అనే ఎంబీబీఎస్ విద్యార్థి జలపాతం(Waterfalls) లో పడి మృతి చెందాడు. దీంతో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు చందు మృతదేహాన్ని స్వగ్రామం తీసుకొచ్చేలా సాయం చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ని బాధిత కుటుంబ సభ్యులు కోరారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని అకాపల్లికి చెందిన దాసరి చందు కర్గిస్థాన్‌లో MBBS సెంకడియర్ చదువుతున్నాడు. ఆదివారం అతడు ఏపీకి చెందిన మరో నలుగురు విద్యార్థులతో కలిసి ఓ జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లాడు. అక్కడ వెళ్లాక గడ్డకట్టిన మంచులో చిక్కుకపోయి చందు మృతి చెందాడు.

Also read: వాళ్ల కోసం ప్రధాని మోదీ రూ.16 లక్షల కోట్లు మాఫీ చేశారు: రాహుల్

చందు మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కర్గిస్థాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అతడి తల్లిదండ్రులు తెలిపారు. మృతదేహాన్ని అనకాపల్లికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే పరీక్షలు ముగిసిన తర్వాత దగ్గర్లో ఉన్న జలపతానికి యూనివర్సిటీ యాజమాన్యం తీసుకెళ్లినట్లు సమాచారం అందుతోంది. సెల్ఫీ దిగుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Also Read: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. టికెట్ క్యాన్సిల్ అయితే తక్కువ ఫీజు

Advertisment
తాజా కథనాలు