Uttarakhand: పోర్న్ చూపించి మరీ లైంగిక దాడి..ఉత్తరాఖండ్‌లో మతగురువు దారుణం కోలకత్తా ట్రైనీ డాక్టర్ రేప్, హత్య తరువాత దేశంలో వరుసగా అమ్మాయిల మీద జరుగుతున్న దాడుల ఘటనలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్ లో ఓ మదర్సాలో మతగురువు చేసిన దారుణాలు వెలుగులోకి వచ్చాయి. పోర్న్ వీడియోలు చూపించి విద్యార్ధినుల మీద లైంగిక దాడికి పాల్పడేవాడని తెలిసింది. By Manogna alamuru 24 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Sexual Abuse By Moulvi: కన్నవారు, తోడబుట్టినవారు, బయటవారు..చివరకు గురువులు..వాళ్ళు, వీళ్ళు అని తేడా లేకుండా అమ్మాయిలు, ఆడవాళ్ళ మీద లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. రోజులో ఎక్కడో ఒకచోట కనీసం ఒక్కరైనా రేప్ కు గురవుతూనే ఉన్నారు. కోలకత్తా ట్రైనీ డాక్టర్ సంఘటన తర్వాత అమ్మాయిల మీద జరుగుతున్న ఆకృత్యాలు చాలానే వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లో ఓ మత గురువు తన విద్యార్ధినుల పట్ల దారుణం ప్రవర్తించిన విషయం బయటకు వచ్చింది. ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్‌లో నొ ఓ మదర్సాలో మౌల్వీ షబ్బీర్ రజా విద్యార్ధినుల మీద లైంగికదాడికి పాల్పడ్డాడు. ఒక ఎనిమిదేళ్ళ బాలిక స్కూలు నుంచి వచ్చిన తర్వాత మౌనంగా ఉండడంతో తల్లి ఆరా తీసింది. దాంతో అసలు విషయం బయటపడింది. పెద్ద పిల్లలు మదర్సా నుండి వెళ్లిన తర్వాత.. మౌల్వీ తనతో పాటు నలుగురు అమ్మాయిలను గదికి తీసుకువెళతారని.. అక్కడ తన మొబైల్లో డర్టీ వీడియోలు చూపిస్తారని ఎనిమిదేళ్ళ బాలిక చెప్పింది. అంతేకాకుండా.. తాకరాని చోట కూడా తాకేవాడని బాలిక తల్లికి చెప్పింది. దీంతో ఆగస్టు 17న బాలిక తల్లి మౌల్వీ షబ్బీర్ మీద పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు మౌల్వీని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే మేజిస్ట్రేట్ ఎదుట ఎనిమిదేళ్ళ బాలిక వాంగ్మూలం ఇచ్చింది. వాది దాఖలు చేసిన ఫిర్యాదులో ఉన్న మరో నలుగురు బాలికల వాంగ్మూలాలను కూడా నమోదు చేశారు. పోర్న్ ఫిల్మ్ చూపించి మౌల్వీ తనపై అత్యాచారం చేశాడని ఐదుగురు బాలికలు ఆరోపించారు. మౌల్వీ ఇతర అమ్మాయిలతో కూడా ఇలాంటి అసభ్యకర చర్యలకు పాల్పడే అవకాశం ఉందని.. ఈ క్రమంలో ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు. Also Read: Kolkata: తమ కూతురిని ఎవరో కావాలని చంపించారు–ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు #moulvi #madarasa #uttarakhand #students #girls మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి