Kolkata: మా కూతురిని ఎవరో కావాలని చంపించారు–ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు మా కుమార్తె ఆసుపత్రికి సంబంధించిన లేదా ఎవరి గురించో రహస్యాలను తెలుసుకుందని...అందుకే ఆమెను చంపేశారని అంటున్నారు మృతురాలు ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు. సంజోయ్ రాయ్ ఎవరో తమకు తెలియదని..మా కూతురిని చంపడానికి అతనిని కూడా ఎవరో పంపించారని అన్నారు. By Manogna alamuru 24 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Trainee doctor Parents: ట్రైనీ డాక్టర్ రేప్ హత్య వెనుక ఎవరో చాలా మందే ఉన్నారని అంటున్నారు ఆమె తల్లిదండ్రులు. కావాలనే ఎవరో తమ కూతురిని హత్య చేయించారని ఆరోపిస్తున్నారు. సంజయ్ రాయ్‌ను కావాలనే తమ కూతురిని చంపడానికి నియమించారని చెప్పారు. ఆసుపత్రికి లేదా కొందరు పెద్దల రహస్యాలను ఆమె తెలుసుకుందని అందుకే ఆమె హత్య చేశారని అన్నారు. తమ కూతురు హత్య గురించి సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ న్యూస్ ను తట్టుకోలేకపోతున్నామని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. తన మీద అటాక్ జరిగినప్పుడు, తనను రేప్ చేస్తున్నప్పుడు తనను కచ్చితంగా తలుచుకునే ఉంటుందని మృతురాలి తల్లి కన్నీరు మున్నీరు అయ్యారు. తమ కూతురు చనిపోయాక ఆర్జీ కర్ ఆసుపత్రి ప్రన్సిపల్ సంజయ్ ఘోష్ తమకు పోన్ చేయలేదని చెబుతున్నారు ఆమె తల్లిదండ్రులు. ఘటన జరిగిన తర్వాత మా దగ్గరకు వచ్చినా ఒక్కమాట కూడా మాట్లాడలేదని చెప్పారు. కనీసం జరిగిన దాని గురించి కూడా చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కూతురు ఎమ్డీ తర్వాత మెడికల్ డీఎమ్ చేయాలని అనుకుందని...దాని కోసం చాలా కష్టపడి చదివేదని గుర్తు చేసుకున్నారు. కానీ ప్రిన్సిపల సంజయ్ ఘష్ తనను ఫెయిల్ చేస్తారని భయపడుతుండేదని చెప్పారు. తన పెళ్ళి కోసం ఖర్చు తానే భరిస్తానని చెప్పేదని..అందుకోసం తన తండ్రికి 5లక్షలు ఇచ్చిందని ట్రైనీ డాకట్ర్ తల్లి చెప్పారు. చనిపోయాక తమ కూతురుని చాలాసేపు తమకు చూపించలేదని చెప్పారు ఆమె తల్లిదండ్రులు. మా అమ్మాయికి బాలేదని ఆర్జీ కర్ ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చింది. మేము మధ్యాహ్నం 12.00 PM గంటలకు ఆసుపత్రికి చేరుకున్నాం. నన్ను ఒకరు పక్కకి తీసుకెళ్లారు. నా భార్యను మరొకరు పక్కకి తీసుకెళ్లారు. కానీ మూడు గంటల వరకు ఎవరూ కూడా మమ్మల్ని సెమినర్ హాల్ వద్దకు తీసుకెళ్లలేదు. పోలీసులు ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు. మా కూతురు పనిచేసే డిపార్ట్‌మెంట్ వాళ్లు ఎవరూ కూడా అక్కడ లేరు. కేవలం పోలీసులు మాత్రమే ఉన్నారు. మేము గట్టిగా అరిచిన తర్వాత చివరికి ప్రిన్సిపల్ మా దగ్గరికి వచ్చాడు. కానీ మాతో ఏమీ మాట్లాడలేదని డాక్టర్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తరువాత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కమిషనర్ ఫోన్‌కు కాల్ చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. మా కూతురి పోస్టుమార్టం సాయంత్రం 6.10 PM గంటలకు ముగిసింది. మా కూతురు తన స్నేహితుల గురించి ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఆమెతో పాటు డ్యూటీలో మరో నలుగురు ఉన్నారు. మా కూతురి అంత్యక్రియలు వేగంగా జరిగిపోయాయి. ఈ కార్యక్రమానికి ఎవరు డబ్బులు పెట్టారో కూడా తెలియదు. ఈ కేసులో మొదటినుంచే పోలీసుల విచారణ తప్పుదారి పడుతోందని ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు అంటున్నారు. Also Read: Kolkata: నా కొడుకు అమాయకుడు, కావాలని ఇరికించారు–కోలకత్తా డాక్టర్ హత్య నిందితుడు తల్లి #trainee-doctor #kolkata #parents మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి