Mark Zuckerberg: 'నన్ను క్షమించండి' 😢.. ఎమోషనల్ అయిన మార్క్‌ జూకర్‌బర్గ్‌

యూఎస్‌ సెనెట్‌లో సోషల్‌ మీడియా వల్ల చిన్నారుల భద్రతకు సంబంధించి విచారణ జరుగుతున్న సమయంలో మెటా సీఈఓ మార్క్‌ జూకర్ బర్గ్‌ లేచి బాధిత తల్లిదండ్రులకు సారీ చెప్పారు. సోషల్ మీడియాలో చిన్నారుల భద్రతపై ఎలాంటి చర్యలు లేవని చట్ట సభ సభ్యులు అనడంతో జూకర్‌బర్గ్ ఇలా స్పందించారు.

New Update
Mark Zuckerberg: 'నన్ను క్షమించండి' 😢.. ఎమోషనల్ అయిన మార్క్‌ జూకర్‌బర్గ్‌

Mark Zuckerberg: ఈరోజుల్లో ప్రతిఒక్కరి చేతికి స్మార్ట్‌ ఫోన్లు వచ్చాక నిత్యం సోషల్ మీడియా (Social Media) వాడటం అందరికి ఓ అలవాటుగా మారిపోయింది. ప్రతిరోజూ యూట్యూబ్, ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ (WhatsApp) లాంటి యూప్స్‌లలో గంటల పాటు గడుపుతున్నారు. పెద్దవాళ్లే కాదు ఆఖరికి చిన్నపిల్లలు కూడా స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నారు. ఈ మధ్య చిన్నారుల్లో శారీరకంగా ఆడే ఆటల కంటే మొబైల్‌ ఫోన్లలో ఆడే ఆటలే విపరీతంగా పెరిగిపోయాయి. అలాగే సోషల్ మీడియాలో వీడియోలు చుడటం కూడా చిన్న పిల్లలకు అలవాటైపోయింది. అయితే ఈ మధ్య సోషల్ మీడియలో చిన్నారులపై కూడా వేధింపులు కూడా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

Also Read: వరల్డ్‌లో అత్యంత తక్కువ అవినీతి దేశాల లిస్ట్‌లో భారత్ ఎక్కడుందో తెలుసా?

జూకర్‌బర్గ్‌పై ఆగ్రహం

ఈ నేపథంలోనే ఈ విషయంపై మెటా సీఈఓ మార్క్‌ జూకర్‌ (Meta CEO Mark Zuckerberg) స్పందించారు. సోషల్‌ మీడియా వేదికల్లో చిన్నారుల భద్రతకు సంబంధించి తల్లిదండ్రులకు క్షమాపణలు తెలియజేశారు. ఈ వ్యవహారంపై యూఎస్‌ సెనెట్‌ విచారిస్తున్న సమయంలో జూకర్‌బర్గ్‌ మధ్యలో లేచి ఈ వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వల్ల చిన్నారులపై పడుతున్న ప్రమాదాన్ని కట్టడి చేసేందుకు సరైన చర్యలు తీసుకోవడం లేదంటూ చట్టసభ సభ్యులు జూకర్‌బర్గ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విచారణలో మెటాతో పాటు టిక్‌టాక్, ఎక్స్‌(ట్విట్టర్) ,డిస్కార్డ్‌, స్నాప్‌చాట్ ప్రతినిధులు సైతం పాల్గొన్నారు.

Also Read: Paytm పై ఆర్బీఐ చర్యలు.. ఇప్పుడు మనం ఏమి చేయాలి?

చర్యలు తీసుకుంటాం

మీ చేతులకు రక్తం అంటుకుని ఉందంటూ ఆయా సంస్థలపై సభ్యులు తీవ్రంగా విమర్శించారు. దీంతో మెటా సీఈఓ జూకర్‌బర్గ్‌ లేచి బాధిత చిన్నారుల తల్లిదండ్రుల వైపు చూస్తూ విచారం వ్యక్తం చేశారు. మీరు అనుభవించిన బాధ ఎవరికీ రాకూడదంటూ క్షమాపణలు చేశారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సంస్థలు మెటాకు చెందినవి. అయితే వీటి ద్వారా టీనేజర్స్‌కు అపరిచితుల నుంచి వచ్చే సందేశాలను బ్లాక్ చేస్తామంటూ మెటా వెల్లడించింది. ఆ వేదికలపై ఆత్మహత్య, ఈటింగ్ డిజార్డర్‌ను చర్చించే సమాచారంపై ఆంక్షలను కఠినతరం చేస్తామని స్పష్టం చేసింది.

Advertisment