అనంతపనీ చేశాడు నటుడు మన్సూర్ అలీ ఖాన్. తాను చేసిన తప్పును పక్కన పెట్టేసి వాళ్ళు నా పరువు తీశారు అంటూ కోర్టు మెట్లెక్కాడు. తమిళనటుడు మన్సూర్ అలీఖాన్ త్రిష గురించి నోటికొచ్చినట్టు వాగాడు ఓ ప్రెస్ మీట్ లో. అరే ఇదేం పనిరా...అలా మాట్లాడ్డం తప్పు కదా అన్నందుకు ఇప్పుడు చిరంజీవి, త్రిష, కుష్బూ మీద మద్రాసు హైకోర్టులో పరువు నష్టం దావా వేశాడు. పైగా కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలంటూ పిటిషన్ లో కోరాడు. తన వీడియో మొత్తం చూడకుండానే తన పరువుకు భంగం కలిగించారని ఆరోపిస్తున్నాడు మన్సూర్ అలీ ఖాన్. ఈ కేసును డిసెంబర్ 11, సోమవారం మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీష్ కుమార్ ధర్మాసనం విచారించనుంది.
Also Read:వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్…వ్యూ వన్స్ వాయిస్ మెసేజ్
తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో.. చాలా సినిమాల్లో విలన్ గా చాలా మంది హీరోయిన్స్ తో రేప్ సీన్స్ చేశాను. లియో సినిమాలో నన్ను సెలెక్ట్ చేసినప్పుడు త్రిషతో రేప్ సీన్ ఉంటుంది అనుకున్నాను. కానీ లేనందుకు బాధపడ్డాను అని వ్యాఖ్యలు చేయడంతో ఇవి సంచలనంగా మారాయి. మన్సూర్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనికి త్రిష వెంటనే స్పందించింది. మన్సూర్ తో ఇంకెప్పుడూ యాక్ట్ చేయనని చెప్పేసింది. తనతో పాటూ లియో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, మెగాస్టార్ చిరంజీవి, తమిళ నటి, రాజకీయ నాయకురాలు కుష్బూతో పాటూ తమిళ నటుల సంఘాలు కూడా అలా ఖాన్ వ్యాఖ్యలను ఖండించాయి. అలీఖాన్ మీద కేు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ రాశాయి. దీంతో చెన్నై థౌజండ్ లైట్ పోలీసులు మన్సూర్ మీద రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అదే సమయంలో అతను ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే దానిని కోర్టు తిరస్కరించింది కూడా. ఇక విమర్శలు తీవ్రతరం అవడంతో మన్సూర్ త్రిషకు క్షమాపణ చెప్పాడు. త్రిష కూడా అంగీకరించింది.
కానీ మళ్ళీ ఏమైందో ఏమో...తన పరువుకు త్రిష, చిరంజీవి, కుష్బూ పరువు నష్టం కలిగించారని కోర్టులో కేసు వేస్తానని ప్రకటించాడు. అన్నట్టే వేశాడు కూడా. అసలు మన్సూర్ మాటలను చాలా మంది ఖండించారు. కానీ ప్రత్యేకంగా అతను ఈ ముగ్గురి మీదనే కోర్టులో కేసు వేశాడు.