దిమాక్ ఉన్నోడు దునియాలో ఎక్కడైనా బతుకుతాడు...వైరల్ వీడియో..!! By Bhoomi 14 Nov 2023 in టాప్ స్టోరీస్ వైరల్ New Update షేర్ చేయండి కళ్లు ఉన్నోడు ముందు చూస్తాడు..కానీ దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడని ఓ సినిమా డైలాగ్ ఉంటుంది. ఇది అక్షరాల సత్యం. నిజంగా దిమాక్ ఉండాలే కానీ..ఎలాంటి పరిస్థితులు అయినా మనకు అనుకూలంగానే మార్చుకోవచ్చు. తాజాగా ఓ వ్యక్తి చేసిన పని నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియా వచ్చాక ప్రతి విషయం ఇట్టే జనాల్లోకి చేరిపోతుంది. అంతేకాదు ఈ ప్రపంచంలో మీకు వినోదాన్ని అందించే ప్రతిదాన్ని మీరు ఎంచుకోవచ్చు. ఇప్పుడు అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియో చూసిన తర్వాత, మీ చిన్ననాటి జ్ఞాపకాలు రిఫ్రెష్ అవుతాయి. మీకు గుర్తుంటే, మీరు బస్సులో ప్రయాణించినప్పుడల్లా, ఒక వ్యక్తి బస్సు ఎక్కి ఏదైనా అమ్మడం చూసే ఉంటారు. ఆ వ్యక్తి మాటలు భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు ఢిల్లీ మెట్రోలో కూడా ఈ దృశ్యాన్ని చూడొచ్చు. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు. వీడియోలో, ఒక వ్యక్తి కదులుతున్న మెట్రోలో వస్తువులను అమ్మడం ప్రారంభించాడు. ఆ వ్యక్తి నా మాట వినండి. పౌడర్ ఉంది, టూత్ పేస్టు ఉంది, బామ్ ఉంది, కేవలం 10 రూపాయలు, 10 రూపాయలు. ఎవరికి కావాలంటే వారు చేయి ఎత్తండి అంటూ అరుస్తున్నాడు. కుర్రాడి ఈ స్టైల్ చూసి ప్రయాణికులంతా తెగ నవ్వేశారు. కొంతమంది తమ చిన్ననాటి జ్నాపకాలు గుర్తుకువచ్చాని తెలిపారు. बिजनेस वही, स्टाइल नई😁😁😁 pic.twitter.com/iuJihrOycO — HasnaZarooriHai🇮🇳 (@HasnaZaruriHai) November 14, 2023 ఈ వీడియో @HasnaZaruriHai అనే పేజీ ద్వారా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X (గతంలో ట్విట్టర్)లో షేర్ చేశారు. వీడియోతో పాటుగా , 'వ్యాపారం అదే, కొత్త శైలి అనే క్యాప్షన్ ఇచ్చారు ' వార్తలు రాసే వరకు 8 వేల మందికి పైగా వీడియోను వీక్షించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేశారు. మెట్రోలో అశ్లీల నృత్యానికి బదులుగా నేను ఈ వీడియోను ఇష్టపడతాన్నానంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇది కూడా చదవండి: మీ భర్తలో ఈ మార్పులు కనిపించాయా? అయితే మీకు గుడ్ టైం స్టార్ట్ అయినట్లే..!! #metro #viral-video #delhi-metro #trending-news #social-media మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి