Maharashtra: 20 మందిని పెళ్లి చేసుకొని డబ్బులు, నగలతో పరార్‌.. చివరికి

మహారాష్ట్రంలోని ఠానేకి చెందిన ఓ వ్యక్తి విడాకులు తీసుకున్న మహిళలే లక్ష్యంగా ఏకంగా 20 మందిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ల నుంచి విలువైన నగలు, వస్తువులు, నగదుతో పరారయ్యాడు. ఓ యువతి ఫిర్యాదుతో చివరికి పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

New Update
Maharashtra: 20 మందిని పెళ్లి చేసుకొని డబ్బులు, నగలతో పరార్‌.. చివరికి

విడాకులు పొందిన మహిళలను లక్ష్యంగా చేసుకొని ఓ వ్యక్తి ఏకంగా 20 మందిని పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడు. వారి నుంచి విలువైన నగలు, వస్తువులు, నగదుతో పరారయ్యాడు. చివరికి నిందితుడిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఓ మ్యాట్రిమోనీ వైబ్‌సైట్‌ ద్వారా ఫిరోజ్‌ నియాజ్‌ షేక్ (43) అనే వ్యక్తి విడాకులు పొందిన మహిళలనే టార్గెట్ చేశాడు. మాయమాటలు చెప్పి పెళ్లికి ఒప్పించేవాడు. మహారాష్ట్ర, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఇలా మొత్తం దేశవ్యాప్తంగా 20 మందికిపైగా మహిళలను పెళ్లి చేసుకున్నాడు.

Also read: ఒలింపిక్స్‌లో బోణీ కొట్టిన భారత్‌.. షూటింగ్‌లో మను బాకర్‌కు కాంస్యం

పెళ్లి తర్వాత వాళ్ల నుంచి రూ.లక్షల నగదు, నగలు విలువైన వస్తువులు తీసుకొని పరారయ్యేవాడు. చివరికి అతడి చేతిలో మోసపోయిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహారాష్ట్ర పోలీసులు నిందితుడిని అరెస్టు చేయడంతో అతడి మోసం బయటపడింది. ఫిరోజ్‌ నియాజ్‌ షేక్ ఠానేలోని కల్యాణ్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతడి నుంచి రూ.6 లక్షలకు పైగా నగదు, ల్యాప్‌టాప్‌, సెల్‌ఫోన్లు, చెక్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు. మ్యాట్రిమోనీ వేదికగా 2015 నుంచి అతడు ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది.

Also Read: ఢిల్లీ కోచింగ్ సెంటర్ విషాద ఘటన.. విద్యార్థుల నిరసనలు


Advertisment
తాజా కథనాలు