BJP Govt Forming Illegally - Mamata Banerjee: ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి టీఎంసీ పాల్గొనడం లేదని ఆ పార్టీ అధినేత మమతా బెనర్జీ చెప్పారు. కేంద్రంలో చట్టవిరుద్ధంగా, అప్రజాస్వామ్యంగా ప్రభుత్వం కొలువుదీరుతోందని ఆరోపించారు. 400 సీట్లు గెలుస్తామని చెప్పిన వారు కనీస మెజార్టీ కూడా సాధించలేకపోయారు. ఇప్పుడు మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈసారి బీజేపీ (BJP) ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదంటూ దీదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్న ఇరోజుల్లోనే ఇండియా కూటమి (INDIA Alliance) ప్రభుత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని సార్లు ప్రభుత్వాలు ఒకరోజు కూడా ఉన్న సందర్భాలున్నాయని… అలా ఏదైనా జరిగితే.. ఎన్డీయే కూటమి ప్రభుత్వం కేవలం 15 రోజులు మాత్రమే ఉండొచ్చు అంటూ మమత జోస్యం చెప్పారు. రాబోయే రోజుల్లో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆమె పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.
బెంగాల్‌లో అతి పెద్ద పార్టీ టీఎంసీ (TMC). ఇక్కడ కూడా తామే గెలుస్తామని...400 సీట్లు సాధిస్తామని బీజేపీ చెప్పింది. కానీ అదేమీ జరగలేదు. బెంగాల్‌లో టీఎంసీనే మళ్ళీ మెజార్టీలో గెలిచింది. బెంగాల్‌లో 29 స్థానాల్లో గెలుపొందింది. అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన నాలుగో పార్టీగా టీఎంసీ నిలిచింది.
ఇక ఈరోజు సాయంత్రం 7.15 గంటలకు ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి పొరుగు దేశాల ప్రధానులు, అధ్యక్షులు ముఖ్య అతిధులుగా హాజరవుతున్నారు. ఈ కారణంగా ఢిల్లీలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
Also Read: కొడుకు దగ్గరికి విజయమ్మ.. ఆసక్తికరంగా వైఎస్ ఫ్యామిలీ రాజకీయం!