Mamata Banerjee : ఎగ్జిట్ పోల్స్‌ను బహిష్కరిస్తున్నాం..అసలు ఫలితాల కోసం వెయిట్ చేయాలి-మమతా బెనర్జీ

లోక్‌సభ ఎన్నికల మీద నిన్న వెలువడిన ఎగ్జిట్ ఫలితాలను బహిష్కరిస్తన్నామన్నారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. అవన్నీ మోసపూరితమైనవి అని పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని కోరారు.

Budget 2024: ప్రజలను మోసగించిన బడ్జెట్‌- బెంగాల్ సిఎం మమత బెనర్జీ
New Update

West Bengal Prime Minister : లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha Elections) సంబంధించి నిన్న బయటకు వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు (Exit Polls Results) అంగీకరించమని ప్రకటించారు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee). 2016, 2019, 2021లో కూడా ఇలానే తప్పుడు ఫలితాలు వెలువడ్డాయని.. తుది ఫలితాలను తారుమారు చేయడానికే గోడీ మీడియా ఇలా చేస్తోందని ఆమె మండిపడ్డారు. పార్టీ కార్యకర్తులు ఎగ్జిట్ ఫలితాలను దృష్టిలో పెట్టుకుని భయపడనవసరం లేదని అన్నారు. మోసపూరిత వ్యూహాలకు లొంగకుండా అందరూ బలంగా ఉండాలని కోరారు. అసలు ఫలితాలను తారుమారు చేయడానికి బీజేపీ భారీ మొత్తాన్ని చెల్లిస్తోందని మమతా అన్నారు. ఈసారి ఎన్నికల్లో ఇండియా కూటమి నాయకులు అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్, ఎంకే స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రే వంటివారు సమర్ధవంతమైన పనితీరును కనబరుస్తారని ముఖ్యమంత్రి పశ్చిమ బెంగాల్ (West Bengal) మమతా బెనర్జీ అన్నారు.

ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని వచ్చింది. దీని తర్వాతనే మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలను చేశారు. న్యూస్ 18 ఎగ్జిట్ పోల్ ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ 21-24 సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది. టీఎంసీ 18-21 సీట్లు గెలుచుకుంటుందని చెప్పింది. ఇండియా టీవీ పోల్ ప్రకారం ఎన్డీయేకు 22-26 సీట్లు, టీఎంసీకి 14-18 సీట్లు, కాంగ్రెస్‌కు 1-2 సీట్లు వస్తాయని చెప్పింది. ఏబీపీ న్యూస్-సీఓటర్ ప్రకారం.. బీజేపీకి 23-27 సీట్లు వస్తాయని, తృణమూల్ కాంగ్రెస్‌కు 13-17 సీట్లు వస్తాయని అంచనా.ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ప్రకారం, బీజేపీకి 26-31 సీట్లు, టీఎంసీకి 11-14 సీట్లు, ఇండియా కూటమికి 0-2 సీట్లు వస్తాయని తెలిసింది.

Also Read:T20 World Cup : పపువా న్యూగినియా మీద చెమటోడ్చి నెగ్గిన విండీస్

#bjp #west-bengal #mamata-banerjee #tmc #exit-polls
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe