Mallikarjun Kharge : త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలే భారత దేశానికి(India) చివరి ఎన్నికలంటూ కాంగ్రెస్(Congress) అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjun Kharge) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒడిశాలోని భువనేశ్వర్ (Bhubaneswar) లో ఆయన కాంగ్రెస్ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ఈ క్రమంలో ఆయన భారత ప్రధాని మోడీ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
భారత్ లో మోడీ(Modi) మళ్లీ అధికారంలోకి వస్తే ఇక పై ఎన్నికలు జరగవని పేర్కొన్నారు. కాబట్టి ఈ సారి ఎన్నికల్లో ప్రజలు చాలా జాగ్రత్తగా ఓటేయాలని ఖర్గే కోరారు. మోడీ ఈసారి ప్రధాని అయితే మాత్రం దేశంలో నియంతృత్వమే రాజ్యం ఏలుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా సరే బీజేపీని(BJP) తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో మతపరమైన సెంటిమెంట్లను ఉపయోగించుకుని బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో గెలవాలని చూస్తుందని ఆయన తెలిపారు. రాజకీయాలకు మతాలను అడ్డుపెట్టుకుని గెలవాలని ముందు నుంచి బీజేపీ యోచిస్తుందని ఆయన ఆరోపించారు.
దేశ అభివృద్ది గురించి కానీ, ప్రజా సంక్షేమం గురించి కానీ బీజేపీకి ఎలాంటి ఆలోచన, ఆసక్తి లేదని ఆయన పేర్కొన్నారు. బీజేపీ నాయకులకు ఎంత సేపు కూడా సొంత రాజకీయాలు, అధికారం, దేశాన్ని దోచుకోవడం గురించే ఆలోచన ఉంటుందని విమర్శించారు.
ఈ క్రమంలో నిన్న, మొన్నటి వరకు ఇండియా కూటమి తో చెట్టపట్టాలేసుకుని తిరిగి, మీటింగ్‌లకు హాజరై… కూటమితోనే ఉంటాను అని సంకేతాలిచ్చిన నితీశ్ ఇప్పుడు సడెన్ గా యూ టర్న్ తీసుకుని బీజేపీలోకి వచ్చి చేరారు. ఆయనను ఒప్పించేందుకు ఆర్జేడీ-కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
నితీశ్ కుమార్ ఇండియా కూటమిని వదిలి బయటకు వెళ్లడం కూటమికి పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు. దీని ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఉండనున్నట్లు స్పష్టం గా కనిపిస్తుంది. ఇప్పటి కే ఇండియా కూటమి నుంచి మమతా బెనర్జీ, కేజ్రీవాల్ బయటకు వెళ్లిన విషయం తెలిసిందే.
Also read: ట్రాన్స్‌కో, జెన్‌కో డైరెక్టర్ల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్..!!