Maldives: మా దేశానికి టూరిస్టులను పంపించండి ప్లీజ్..చైనాను వేడుకుంటున్న మాల్దీవులు!

మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జు చైనాని సాయం కోరడం ప్రారంభించారు. తమ దేశానికి అత్యధిక సంఖ్యలో టూరిస్టులను పంపించాలంటూ ఆయన చైనా ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే మాల్దీవులు అధ్యక్షునికి చైనా అనుకూల నేత అనే పేరు ఉంది.

New Update
Maldives:తగువు పెట్టుకున్నా బడ్జెట్ ఇచ్చారు..మాల్దీవులకు 600కోట్లు

Maldeives: భారత ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi)  లక్షద్వీప్ (Lakshdweep) అంశంలో మాల్దీవుల మంత్రులు చేసిన ఓవరాక్షన్‌ గురించి అందరికీ తెలిసిందే. దీంతో మాల్దీవుల మీద భారతీయులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మోడీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు డిప్యూటీ మంత్రులకు మాల్డీవుల ప్రభుత్వం ఉద్వాసన పలికింది కూడా. అయినా కూడా భారతీయులు కనికరించడం లేదు.

దీంతో టూరిజాన్నే (Tourism)నమ్ముకున్న మాల్దీవులకు భారతీయులు చుక్కలు చూపిస్తున్నారు. భారతీయులంతా ఒక్కసారిగా బాయ్‌కాట్‌ మాల్దీవులు అంటూ గొంతెత్తారు. దీంతో పర్యాటకం మీద ఆధారపడ్డ మాల్దీవులు ప్రస్తుతం ఈగలు తొలుకుంటుందని చెప్పవచ్చు. ఈ ఊహించని పరిణామంతో మాల్దీవుల ప్రభుత్వం కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

ఎందుకంటే మాల్దీవులను సందర్శించే టూరిస్టుల్లో అత్యధికులు భారతీయులే (Indians) కాబట్టి. ఇప్పుడు భారతీయులు బాయ్‌కాట్ చేయడంతో గత కొన్ని రోజులుగా మాల్దీవుల టూరిజం మందగించిందనే చెప్పుకొవచ్చు. దీంతో మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జు చైనాని సాయం కోరడం ప్రారంభించారు. తమ దేశానికి అత్యధిక సంఖ్యలో టూరిస్టులను పంపించాలంటూ ఆయన చైనా ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే మాల్దీవులు అధ్యక్షునికి చైనా అనుకూల నేత అనే పేరు ఉంది.

ప్రస్తుతం ఆయన చైనాలోనే ఉన్నారు. దీంతో ఆయన అక్కడ జరుగుతున్న బిజినెస్ ఫోరం మీటింగ్ లో పాల్గొని ప్రసంగించారు. చైనా మాకు అత్యంత సన్నిహిత దేశం అని కీర్తించారు. మా డెవలప్‌ మెంట్‌ కు చైనానే భాగస్వామి అంటూ కొనియాడారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ 2014 లో ప్రారంభించిన బెల్డ్ అండ్‌ రోడ్‌ పథకం బేష్‌ అంటూ కొనియాడారు. మాల్దీవుల చరిత్రలోనే అత్యంత ప్రాముఖ్యత ఉన్న ప్రాజెక్టులు చైనా చలవేనని అన్నారు.

కొవిడ్‌ సంక్షోభానికి ముందు చైనా మాకు అతి పెద్ద వ్యాపార భాగస్వామిగా ఉందని..ఆ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాల్సిందిగా చైనాను ముయిజ్జు కోరారు. మాల్దీవుల్లో పర్యాటకాన్ని అభివృద్ది చేసేందుకు రెండు దేశాల మధ్య కూడా 50 మిలియన్ల డాలర్ల ఒప్పందం కుదిరినట్లు మాల్దీవుల మీడియా తెలిపింది.

Also read: మీరే నాకు నాన్న..మీరే అమ్మ..మీరే అన్ని..ఎమోషనల్ అయిన సూపర్‌ స్టార్‌!

Advertisment
తాజా కథనాలు