Indian 2 : ‘ఇండియన్‌ 2’ టైటిల్ చేంజ్.. నిర్మాత కీలక ప్రకటన!

కమల్ హాసన్, శంకర్ తాజా చిత్రం 'ఇండియన్ 2' రీలీజ్ అండ్ టైటిల్ చేంజ్ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. త్వరలో ట్రైలర్, జూన్ లో మూవీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. అలాగే ఇతర భాషల్లో 'ఇండియన్ 2'గా తెలుగులో మాత్రం 'భారతీయుడు 2'గానే రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు.

Indian 2 : ‘ఇండియన్‌ 2’ టైటిల్ చేంజ్.. నిర్మాత కీలక ప్రకటన!
New Update

Kamal-Shanker : సూపర్ హిట్ కాంబో డైరెక్టర్ శంకర్(Director Shankar), విలక్షణ నటుడు కమల్ హాసన్(Kamal Hassan) ల అప్ కమింగ్ మూవీ 'ఇండియన్ 2'(Indian 2) కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ బిగ్ అప్ డేట్ వెలువడింది. 'భారతీయుడు' సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిస్తున్న సినిమా రీలీజ్ డేట్ అండ్ టైటిల్ చేంజ్ పై మేకర్స్ కీలక ప్రకటన చేశారు.

ఇది కూడా చదవండి: Hyderabad: ఫోన్‌ ట్యాపింగ్, కిడ్నాప్ కేసులో పుష్ప2 నిర్మాత.. 34 సెక్షన్ల కింద కేసు నమోదు!

పాన్‌ వరల్డ్‌ రేంజ్..

ఈ మేరకు 28ఏళ్ల క్రితమే పాన్‌ ఇండియా రేంజ్ లో హిట్ అయిన భారతీయుడు(Bharateeyudu) సినిమాను ‘ఇండియన్‌ 2’గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవలే ఈ మూవీనుంచి కమల్ హాసన్ లుక్ రిలీజ్ చేసి అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశారు. అయితే తాజాగా త్వరలో ట్రైలర్‌, జూన్‌లో సినిమా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. అంతేకాదు సినిమాను పాన్‌ వరల్డ్‌ రేంజ్ లో విడుదల చేయడానికి సన్నాహలు చేస్తున్నామని, ఇతర భాషల్లో ‘ఇండియన్‌ 2’గా తెలుగులో ‘భారతీయుడు 2’ పేరుతోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని స్పష్టం చేశారు. లైకా ప్రొడక్షన్స్‌ అధినేత సుభాస్కరన్‌ నిర్మిస్తున్న సినిమాలో సిద్ధార్థ్‌, కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ప్రీత్‌సింగ్‌, ప్రియా భవానీ, శంకర్‌, ఎస్‌.జె.సూర్య, బాబీ సింహా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుద్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నారు.

#indian-2 #kamal-haasan #shanker #bharateeyudu-movie
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe