Guntur Kaaram: JSP + TDP = JDP 😂😂 గురూజీ మార్క్‌ కండువా!

మహేశ్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబోలో తెరకెక్కిన 'గుంటూరుకారం' సినిమా మేకింగ్‌ వీడియో రిలీజైన విషయం తెలిసిందే. ఈ వీడియోలో ఓ సీన్‌లో ఓ వ్యక్తి కండువా కప్పుకోని ఉన్నాడు. ఆ కండువాపై JDP అని రాసి ఉంది. దీని అర్థం 'JSP + TDP = JDP' అని ఫ్యాన్స్ ట్వీట్లు వేస్తున్నారు.

New Update
Guntur Kaaram: JSP + TDP = JDP 😂😂 గురూజీ మార్క్‌ కండువా!

Guntur Kaaram: 'గుంటూరు కారం' సినిమా రిలీజ్‌కి టైమ్‌ దగ్గరపడుతున్న కొద్దీ ఫ్యాన్స్‌ ఎక్కడా ఆగలేపోతున్నారు. సోషల్‌మీడియా ఉంది కదా ఏదైనా రాసేసుకోవచ్చు.. ఏదైనా పోస్టు చేసేసుకోవచ్చు.. అడిగేదెవరూ.. ఆపేదెవరూ. సినిమా హైప్‌కి తగ్గట్టే.. 'గుంటూరు కారం' గురించి నిత్యం ఏదో ఒక విషయం నెట్టింట్లో వైరల్‌ అవుతూ ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకింగ్‌ వీడియో రిలీజైన విషయం తెలిసిందే. ఈ వీడియోలో ఓ సీన్‌ అందరి దృష్టిని తమవైపునకు తిప్పుకుంది.

మహేశ్‌ (Mahesh Babu) పక్కన ఓ అబ్బాయి నిలబడి ఉన్నాడు. అతను ఏదో రాజకీయ నాయకుడి గేటప్‌లో ఉన్నాడు. చెదిరిన క్రాఫ్‌తో ఉన్నాడు. అతని భుజంపై ఓ కండువా ఉంది. దానిపై 'JDP' అని రాసి ఉంది. ఇది గమనించిన మహేశ్‌, పవన్‌ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, వైసీపీ మద్దతు దారులు ఆ వీడియోను స్రీన్‌షాట్‌ తీశారు. జూమ్‌ఇన్‌ చేసి 'JDP' అని రాసి ఉన్నదాని హైలెట్ చేసి సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనికి సంబంధించిన ట్వీట్లను కింద చెక్‌ చేసుకోండి.

గుంటూరు కారం మేకింగ్ వీడియో:

ఇక సినిమా మరి కొద్దీ గంటల్లో రిలీజ్ కాబోతున్న సమయంలో మూవీకి మరింత హైప్ పెంచేలా గుంటూరు కారం మేకింగ్ వీడియోను (Guntur Kaaram Making Video) విడుదల చేశారు మేకర్స్. మేకింగ్ వీడియో చూసి మహేశ్‌ అభిమానులు మరింత ఖుషీ అవుతున్నారు. కొన్ని ఫైట్ సీన్స్ చిత్రీకరణలో మహేశ్‌ బాబు కొత్త లుక్ లో కనిపించారు. మాస్ ఫ్యాన్స్ కు మాస్ మసాలా ఎంటర్ టైన్మెంట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మేకింగ్ వీడియో చూస్తే థియేటర్స్ లో మరో సారి మహేశ్‌ బాబు దుమ్ము లేపనున్నట్లు అర్థమవుతుంది.

Also Read: అత్తను రఫ్ఫాడిస్తున్న స్వప్న.. అప్పుకు యాక్సిడెంట్..షాక్ లో కావ్య..!

WATCH:

Advertisment
తాజా కథనాలు