Sitara Gattamaneni: మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించే సితార తన లేటెస్ట్ ఫోటోలు, డాన్స్ వీడియోలతో సందడి చేస్తూ ఉంటుంది. ఇక ఫ్యామిలీతో ట్రిప్స్, వెకేషన్స్ వెళ్ళినప్పుడు.. నమ్రత, మహేష్ బాబుతో కలిసి ఉన్న క్యూట్ ఫొటోలతో అభిమానులను
ఆకట్టుకుంటూ ఉంటుంది సితార. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సితార పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు GMB ఎంటర్ టైన్మెంట్స్ టీమ్ గుర్తించింది.
Sitara Gattamaneni: మహేశ్ కూతురు సితార పేరుతో ఫేక్ అకౌంట్స్.. నమ్రత పోస్ట్ వైరల్!
సితార పేరుతో ఫేక్ ఇన్స్టా అకౌంట్స్ క్రియేట్ చేసి వాటి ద్వారా ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ లింకులు పలువురికి పంపుతున్నట్లు GMB టీమ్ గుర్తించింది. దీనికి సంబంధించి నమ్రత మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెలెబ్రెటీల పేరుతో ఇటువంటి ట్రేడింగ్ లింకులు వస్తే జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Translate this News: