Siddu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డ బర్త్ డే పార్టీలో హీరో, హీరోయిన్స్ సందడి.. వైరలవుతున్న ఫొటోస్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ.. తాజాగా తన బర్త్ డే జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి టాలీవుడ్ సెలబ్రెటీలు రానా, శిరీష్, నవదీప్, శర్వానంద్, నిర్మాత అల్లు అరవింద్, డైరెక్టర్ చందు మొండేటి, యంగ్ బ్యూటీస్ ఫారియా, చాందిని, శివాని హాజరయ్యారు. By Archana 10 Feb 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Siddu Jonnalagadda: డీజే టిల్లు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ. ఫుల్ లెంగ్థ్ కామెడీ ఎంటర్ టైనర్ గా రిలీజైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో సిద్దు మోస్ట్ పాపులర్ హీరోగా ఎదిగిపోయాడు. ప్రస్తుతం సిద్దు డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ తో మరో సారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే పలు సార్లు పోస్ట్ ఫోన్ అయిన ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే తాజాగా ఈ యంగ్ హీరో తన బర్త్ డే జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సెలెబ్రెటీల కోసం గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేశారు. టాలీవుడ్ హీరోస్ రానా దగ్గుబాటి, శర్వానంద్, అల్లు శిరీష్, నవదీప్, సందీప్ కిషన్ నిర్మాత అల్లు అరవింద్, కార్తికేయ 2 డైరెక్టర్ చందూ మొండేటి, గోపిచంద్ మలినేని, వైవా హర్ష, యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల, యాంకర్ అనసూయ, వైవా హర్ష పలువురు హాజరయ్యారు. యంగ్ బ్యూటీస్ చాందిని, బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య, ఫారియా అబ్దుల్లా , శివాత్మిక, శివాని రాజశేఖర్, ప్రియాంక జువాల్కర్, ఈషా రెబ్బ స్టైలిష్ లుక్స్ లో సిద్దు బర్త్ డే పార్టీలో మెరిశారు. ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన సెలెబ్రెటీల ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ఫోటోల పై మీరు కూడా ఓ లుక్కేయండి.. Also Read: Buchi Babu: రామ్ చరణ్ ‘RC16’ లో నటించే అవకాశం.. డైరెక్టర్ బుచ్చిబాబు ఇంట్రెస్టింగ్ వీడియో Also Read: Eagle Trailer: “దళం..సైన్యం కాదు.. దేశం వచ్చినా ఆపుతాను”.. ఆసక్తికరంగా ఈగల్ ట్రైలర్ #celebreties-in-siddu-birthday-party #siddu-jonnalagadda-birthday-party మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి