Naa Saami Ranga OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న నా సామిరంగ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే నాగార్జున లేటెస్ట్ చిత్రం “నా సామిరంగ”. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్స్ లో సందడి చేసిన ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. “నా సామిరంగ” ఓటీటీ హక్కులను డిస్నీ హాట్ స్టార్ దక్కించుకుంది. ఫిబ్రవరి 17 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ సంస్థ అధికారికంగా వెల్లడించింది. By Archana 10 Feb 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Naa Saami Ranga OTT Release: డెబ్యూ డైరెక్టర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో స్టార్ హీరో నాగార్జున నటించిన లేటెస్ట్ చిత్రం “నా సామిరంగ. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలకు తగ్గట్లుగా వసూళ్లను రాబట్టింది. 1980 బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో.. నాగ్ మాస్ యాక్షన్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను బాగా అలరించాయి. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించారు. ఇక సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో సందడి చేసిన “నా సామిరంగ”.. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా ఓటీటీరిలీజ్ డేట్ ఖరారైంది. నా సామిరంగ ఓటీటీ రిలీజ్ ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ సినిమా హక్కులను దక్కించుకుంది. ఫిబ్రవరి 17 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ఈ సంస్థ అధికారికంగా వెల్లడించింది. కింగ్ ను చూసేందుకు మరొక వారం మాత్రమే ఉంది అంటూ స్ట్రీమింగ్ డేట్ వీడియోను రిలీజ్ చేసింది డిస్నీ హాట్ స్టార్. నా సామిరంగ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మించారు. నాగార్జున సరసన అషికా రంగనాథ్, అల్లరి నరేష్ జోడిగా మిర్నా మీనన్, రాజ్ తరుణ్ జోడీగా రుక్సార్ థిల్లాన్ నటించారు. నాజర్, రవివర్మ, రావు రమేశ్, మధుసూదన్ రావు, షబ్బీర్ కల్లరకల్ ప్రధాన పాత్రలో అలరించారు. ఆస్కార్ గ్రహీత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. Also Read: Janhvi Kapoor: రెడ్ డ్రెస్ లో బాలీవుడ్ బ్యూటీ.. జాన్వీ హాట్ లుక్స్ Just one more week until we get to see the King 👑 #NaaSaamiRangaonHotstar Streaming from 17th Feb only on #DisneyPlusHotstar@iamnagarjuna @allarinaresh @mmkeeravaani @vijaybinni4u @itsRajTarun @AshikaRanganath @mirnaaofficial @RuksharDhillon @actorshabeer @srinivasaaoffl… pic.twitter.com/b32dwWbrIH — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) February 10, 2024 నా సామిరంగ స్టోరీ ఈ సినిమా కథ 1980 కాలంలో అంబాజీపేట గ్రామంలో జరుగుతుంది. ఈ ఊరి గ్రామ పెద్ద నాజర్.. కిష్టయ్య(నాగార్జునకు) చిన్నతనం నుంచి సహాయం చేస్తుంటాడు. ఇక కిష్టయ్య గ్రామ పెద్ద నాజర్ కూతురు మహాలక్ష్మిని ప్రేమించుకుంటారు. ఆ తర్వాత కొన్ని కారణాల చేత వాళ్లిద్దరూ విడిపోతారు. ఇటు గ్రామ పెద్ద (నాజర్) కొడుకు దాసు (షబీర్) కిష్టయ్యను చంపాలని ప్రయత్నిస్తుంటాడు. అసలు వీళ్ళ గొడవలకు కారణమేంటి.. ? కిష్టయ్య, మహాలక్షి ప్రేమ గెలించిందా అనేది నా సామిరంగ కథ Also Read: Buchi Babu: రామ్ చరణ్ ‘RC16’ లో నటించే అవకాశం.. డైరెక్టర్ బుచ్చిబాబు ఇంట్రెస్టింగ్ వీడియో #nagarjuna-movie-naa-saami-ranga #naa-saami-ranga-ott-release-date మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి