/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-11T121140.702-jpg.webp)
Sitara Gattamaneni: మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించే సితార తన లేటెస్ట్ ఫోటోలు, డాన్స్ వీడియోలతో సందడి చేస్తూ ఉంటుంది. ఇక ఫ్యామిలీతో ట్రిప్స్, వెకేషన్స్ వెళ్ళినప్పుడు.. నమ్రత, మహేష్ బాబుతో కలిసి ఉన్న క్యూట్ ఫొటోలతో అభిమానులను
ఆకట్టుకుంటూ ఉంటుంది సితార. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సితార పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు GMB ఎంటర్ టైన్మెంట్స్ టీమ్ గుర్తించింది.
సితార పేరుతో ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ క్రియేట్ చేసి.. వాటి ద్వారా ఇన్వెస్ట్‌మెంట్, ట్రేడింగ్ లింకులు పలువురికి పంపుతున్నట్లు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ టీమ్ గుర్తించింది. ఇటువంటి వాటిని నమ్మొద్దని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ షేర్ చేసింది. దీనికి సంబంధించి నమ్రత ఘట్టమనేని మాదాపూర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెలెబ్రెటీల పేరుతో ఇటువంటి ట్రేడింగ్ లింకులు వస్తే జాగ్రత్తగా ఉండలని GMB టీమ్ సూచించింది.
View this post on Instagram
ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా పంచుకున్న సితార మదర్ నమ్రత ఘట్టమనేని ఒక గమనికను తెలిపారు. @sitaraghattamaneni ఇది మాత్రమే సితారకు సంబంధించిన ఏకైక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్. వెరిఫైడ్ అకౌంట్ తప్ప మరే ఇతర హ్యాండిల్స్ కూడా విశ్వశించకూడదని రాసుకొచ్చారు.
Also Read: Naa Saami Ranga OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న నా సామిరంగ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే