మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో కీలక మార్పులు జరుగనున్నాయి. ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. దీంతో పార్టీ పెద్దలు మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ మీద వేటు వేయడానికి సిద్ధమయ్యారు. ఎన్నికల్లో ఓడిపోవడానికి కమల్ నాథే కారణమని హైకమాండ్ కోపంగా ఉందని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన పీసీసీ పదవికి రాజీనామా చేయనున్నారు. ఈరోజే ఏఐసీసీ ఛీఫ్ మల్లిఖార్జున ఖర్గేను కలిసి తన రాజీనామాను కమల్ నాథ్ సమర్పించే అవకాశం ఉంది. దాంతో పాటూ మధ్యప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కమలనాథ్ అక్కడ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలిశారు. పార్టీ కార్యకర్తలను కలవకుండా కమలన్ నాథ్ చౌహాన్ ను కలవడం కూడా పార్టీ పెద్దలకు ఆగ్రహం తెప్పించింది. ఆయన రాజీనామా చేయడానికి ఇది కూడా బలమైన కారణం అని తెలుస్తోంది.
Also Read:కాల్చుకుని తింటున్నారు…దేశంలో విపరీతంగా మహిళలపై వేధింపులు
2018 అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ గెలిచింది. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కమల్ నాథ్ సీఎం పదవిని చేపట్టారు. అయితే ఆ తర్వాత జ్యోతిరాదిత్య సింధియా మరికొంత నేతలు అలిగి బీజేపీకి వెళ్ళిపోవడంతో కమల్ నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. దీంతో రెండేళ్ళకే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది. దీంతో బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహన్ ముఖ్యమంత్రి అయ్యారు.
ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ చాలా ఓట్ల తేడాతో ఓడిపోయింది. 230 సీట్లకు గానూ బీజేపీ 163 సాధించి విజయకేతనం ఎగురవేయగా...కాంగ్రెస్ కేవలం 66 స్థానాలను మాత్రమే సంపాదించుకోగలిగింది.