/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/31-jpg.webp)
Rowdy Sheeter Srikanth : అతనొక రౌడీ షీటర్. కాచిగూడ(Kacheguda) లో శ్రీకాంత్(Srikanth) కు రౌడీ షీటర్(Rowdy Sheeter) గా పేరుంది. దందాలు చేస్తూ డబ్బులు సంపాదించడం ఇతని వృత్తి. శ్రీకాంత్‌పై గతంలో సుల్తాన్ బజార్, లేక్, చైతన్యపురి పీఎస్‌లలో కేసులు కూడా ఉన్నాయి. బాడీ అంతా పచ్చబొట్లు వేయించుకున్న శ్రీకాంత్ కు మరొక అలవాటు కూడా ఉంది. అవే ఇంస్టా రీల్స్(Insta Reels). ఈ రీల్స్‌తోనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయనర్స్(Social Media Influencers) గా శ్రీకాంత్ మంచి పేరు తెచ్చుకున్నాడు. బైక్ మీద స్టంట్స్ చేస్తూ... డైలాగ్‌లు చెబుతూ ఇన్స్టాలో ఫాలోవర్స్‌ను పెంచుకున్నాడు శ్రీకాంత్. అయితే ఇవే అప్పుడు అతని ప్రాణాలు కూడా తీశాయి.
Also Read : Andhra Pradesh : పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య విభేదాలు
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
బైక్ స్టంట్సే ప్రాణాలు తీశాయి..
నిన్న అర్ధరాత్రి చాదర్‌ఘాట్ పీఎస్ సమీపంలోని సవేరా హోటల్ దగ్గర బైక్ మీద స్టంట్స్ చేస్తున్న శ్రీకాంత్‌ని లారీ వచ్చి గుద్దేసింది. లారీ అతి వేగంగా రావడంతో లారీ చక్రా లకింద పడి శ్రీకాంత్ అక్కడిక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్‌ను అపోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. శ్రీకాంత్ వద్ద నుంచి ఒక సెల్ ఫోన్, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.