Secunderabad : సికింద్రాబాద్.. జంటనగరాలలో విస్తరించి వున్న సికింద్రాబాద్ నియోజకవర్గంలో మూడు మతాల వారితోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాల సెటిలర్లు ఓటర్లు(Voters) గా వున్నారు. పూర్తిగా అర్బన్ ఏరియాలో విస్తరించి వున్న ఈ లోక్‌సభ(Lok Sabha) సీటును గెలుచుకునేందుకు ప్రధాన పార్టీలు హోరాహోరీ తలపడడం ఆనవాయితీగా వస్తోంది.
2019లో బీజేపీ నుంచి కిషన్‌రెడ్డి(Kishan Reddy) గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్ధి తలసాని సాయికిరణ్ యాదవ్ రెండో స్థానానికి పరిమితం అయ్యారు.
ప్రస్తుతం కాంగ్రెస్(Congress) నుంచి దానం నాగేందర్, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్(Padma Rao Goud) పోటీ చేస్తున్నారు.
Also Read : తెలంగాణలో ఎంపీ ఎన్నికల ఫలితాలు ఇలా.. రవిప్రకాశ్ చెప్పిన సంచలన లెక్కలివే!
కాంగ్రెస్
దానం నాగేందర్ - ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ మంత్రి. ఇటీవల తిరిగి కాంగ్రెస్‌లో చేరారు.
బీజేపీ
కిషన్ రెడ్డి - సిట్టింగ్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.
బీఆర్ఎస్
పద్మారావు గౌడ్ - డిప్యూటీ స్పీకర్‌గా చేశారు. ఎమ్మెల్యేగా ఉన్నారు.
బీజేపీ గెలిచే అవకాశం.
రీజన్స్:
1) సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రిగా వుండడం కిషన్ రెడ్డికి సానుకూలాంశం.
2) మోదీ చరిష్మా అదనపు ప్లాస్ పాయింట్
3) అవినీతి ఆరోపణలు లేకపోవడం.
4) కాంగ్రెస్ అభ్యర్థి జంపింగ్ జపాంగ్.. కాంగ్రెస్ క్యాడర్ చాలా చోట్ల సహకరించడం లేదు.
5) బీఆర్‌ఎస్ పద్మారావు.. నామమాత్రపు పోటీ అంటున్నారు.
6) ముస్లింలు, క్రిస్టియన్ల ఓట్లు పెద్ద సంఖ్యలో వున్నా.. అవి గంపగుత్తగా కాంగ్రెస్ వైపు మళ్ళితే కిషన్ రెడ్డి విక్టరీ అనుమానమే. లేకపోతే.. బొటాబొటీ మెజారిటీతో బయటపడతాడు.