Lok Sabha Election Results Analysis By RTV Ravi Prakash: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారం రణరంగాన్ని తలపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు మించి ఫలితాలను సాధించి తెలంగాణలో తమకు తిరుగులేదని చాటాలని అధికార కాంగ్రెస్ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో మెరుగైన సీట్లు సాధించి తెలంగాణ గడ్డపై తమ ప్రభావం తగ్గలేదని చాటేందుకు బీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. కుదిరితే ఒకటి లేదంటే రెండో స్థానంలో నిలిచి రానున్న రోజుల్లో రాష్ట్రంలో తమదే అధికారం అనే వాతావరణం తీసుకురావాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఇందుకోసం ఆయా పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అన్న అంశంపై ఆర్టీవీ అంచనాలను వెల్లడించారు రవిప్రకాశ్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీవీని తెలుగులో నెంబర్-1 డిజిటల్ ప్లాట్‌ఫాంగా మార్చిన తెలుగు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల నుంచి తనను దూరం చేయాలని, తనను మాట్లాడనివ్వకూడదని ఎన్నో ప్రయత్నాలు చేశారన్నారు. నిజాలను చెప్పడానికి మరోసారి ప్రజల ముందుకు వచ్చానని చెప్పారు. ఇప్పుడు దేశమంతా ఎన్నికల హీట్ పీక్ స్టేజ్‌లో ఉందన్నారు రవిప్రకాశ్. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నికల్లో తెలంగాణ ఏం నిర్ణయించబోతోంది? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొందన్నారు. నిజం చెప్పాలంటే.. తెలంగాణ ప్రజలు ఎవరికి మద్దతు ఇవ్వాలో ఇప్పటికే నిర్ణయించుకున్నారని వివరించారు.
Telangana Loksabha Results trailer is out .. Ravi Prakash is coming with the most reliable ground study…What will be the result of 17 seats? Watch most authentic detail of possible winners in each seat … tonight at 8 p.m on RTV#Telangana #LokSabhaElections2024 pic.twitter.com/9InKbtPizQ
— Ravi Prakash Official (@raviprakash_rtv) May 1, 2024
తను చెబుతున్న ఈ లెక్కలన్నీ ఎవరో చేసిన సర్వే ఆధారంగా చెబుతున్నవి కాదని.. లోతైన అధ్యయనంపై ఆధారపడి ఈ లెక్కలు చెబుతున్నానని తెలిపారు. ఈ రోజు ఎన్నికలు జరిగితే దాదాపు ఇవే ఫలితాలు అందరూ చూస్తారన్నారు. అయితే పోలింగ్‌కు ఇంకా 12 రోజుల టైముందన్నారు. రాజకీయాల్లో ఒక వారం కూడా చాలా కీలకంగా ఉంటుందని.. ఆకస్మిక సంఘటన ఏదైనా ఎన్నికల మూడ్‌ని మార్చేస్తుందన్నారు. కానీ ప్రస్తుతం అలాంటి సంఘటన ఇక్కడ జరగలేదన్నారు. రవిప్రకాశ్ ఇంకా ఏమన్నారు? ఎన్నికల ఫలితాలపై ఆయన చెబుతున్న లెక్కలేంటి? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.