Narendra Modi: నాకు వారసులు మీరే.. మోదీ ఎమోషనల్!

నాకు దేశంలో ఉండే ప్రజలే వారసులని.. దేశ ప్రజలు తప్ప తనకు వేరేవరు లేరని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురయ్యారు. ఆదివారం హుగ్లీలో జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

New Update
Narendra Modi: నాకు వారసులు మీరే.. మోదీ ఎమోషనల్!

Modi: నాకు దేశంలో ఉండే ప్రజలే వారసులని.. దేశ ప్రజలు తప్ప తనకు వేరేవరు లేరని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురయ్యారు. హుగ్లీలో జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తూ.. పిల్లల కోసం ఏదైనా చేయాల్సిన కుటుంబ యజమాని మాదిరిగానే నా కుటుంబంలోని పిల్లలకు ‘వీక్షిత్‌ భారత్‌’ ఇవ్వాలని కోరుకుంటున్నట్లు వివరించారు.

ప్రధాని మోదీ వారసుడు ఎవరు? అనే ప్రశ్న గురించి మోదీ మాట్లాడుతూ... మీరు నా దేశస్థులు, నా కుటుంబం. ఈ లోకంలో మీరు తప్ప నాకు ఎవరు లేరు. మీరే నా కుటుంబం.. నా ఈ కుటుంబం కోసం ఏం చేయడానికైనా సిద్ధమే. టీఎంసీ, ఇతర పార్టీలు దేశ ప్రజలను దోచుకుంటున్నాయి. తన వారసుల కోసం బంగ్లాలు, భవనాలు నిర్మించడం. "వారు తమ వారసులకు భవిష్యత్తును నిర్మించడానికి సిద్ధమవుతుంటే, నేను కూడా నా వారసులకు భవిష్యత్తును నిర్మిస్తున్నాను" అని ప్రధాని మోదీ అన్నారు. మూడు దశల ఎన్నికల్లో పనితీరును బట్టి చూస్తే ఎన్డీయే 400 సీట్లు దాటుతుందని కచ్చితంగా చెప్పగలను అని మోదీ అన్నారు.

తృణమూల్ కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలను విమర్శిస్తూ, టీఎంసీ గూండాలు పార్టీ నాయకులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సందేశ్‌ఖాలీలో వేధింపులకు గురైన మహిళలను బెదిరిస్తున్నారని, క్రూరమైన నేరాలకు పాల్పడిన నేరస్థులను రక్షించడానికి వారంతా కృషి చేస్తున్నారని మోదీ అన్నారు.

టీఎంసీ పాలనలో పశ్చిమ బెంగాల్ అవినీతి, బాంబుల తయారీ కుటీర పరిశ్రమల కేంద్రంగా మారిందని ప్రధాని మోదీ ఆరోపిస్తూ, రాష్ట్ర పాలనా వ్యవస్థ ఓటు బ్యాంకు రాజకీయాలకు లొంగిపోయిందని అన్నారు. రామమందిర నిర్మాణం తర్వాత ప్రతిపక్షాలకు నిద్ర కరువైంది. రామమందిరం కోసం 500 ఏళ్లుగా పోరాడిన మన పూర్వీకుల ఆత్మలు మీ చర్యలను చూస్తున్నాయని మోదీ అన్నారు. టీఎంసీ, కాంగ్రెసోళ్లు కనీసం మీ పూర్వీకుల త్యాగాన్ని, తపస్సును, త్యాగాన్ని అవమానించకండి. రాముడిని బహిష్కరించడం బెంగాల్ సంస్కృతి కాదని మోదీ అన్నారు.

Also read: మీ ఓటును వేరేవాళ్లు వేశారా..అయినా మీరు కూడా వేయోచ్చు తెలుసా..? ఎలాగంటే!

Advertisment
Advertisment
తాజా కథనాలు