Telangana BJP MP Candidates: బీజేపీ మొదటి లిస్ట్.. తెలంగాణ ఎంపీ అభ్యర్థులు వీరే! తెలంగాణ నుంచి లోక్ సభ ఎన్నికల బరిలో దిగబోతున్న అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ అధిష్టానం మరికాసేపట్లో విడుదల చేయనుంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపురావు పేర్లు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 01 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana BJP MP Candidates: లోక్ సభ ఎన్నికలకు సిద్ధమైంది బీజేపీ. ఈ నేపథ్యంలో అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. ఆర్టికల్ 370 రద్దు చేసి చరిత్ర సృష్టించిన బీజేపీ పార్టీకి దేశ ప్రజలు 370 సీట్లు అభ్యర్థులను గెలిపించి భారత్ దేశ పగ్గాలను మరోసారి తమకే అప్పజెప్పుతారని ప్రధాని మోడీ (PM Modi), అమిత్ షా (Amit Shah) లు ప్రచారాలు చేస్తున్నారు. అదే దిశగా బీజేపీ హైకమాండ్ కూడా గెలిచే గుర్రాలకే టికెట్ ఇవ్వాలని భావిస్తోంది. మరికొన్ని గంటల్లో 100 నుంచి 130 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని రానున్న లోక్ సభ ఎన్నికలపై (Lok Sabha Elections) మెయిన్ ఫోకస్ చేశారు బీజేపీ పెద్దలు. ఈ క్రమంలో తెలంగాణకు వరుసగా కేంద్ర మంత్రులు పర్యటిస్తున్నారు. కాసేపట్లో తెలంగాణ ఎంపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదల కానున్నట్లు సమాచారం. RTV వద్ద మొదటి లిస్టులో ఉండే ఎంపీ అభ్యర్థుల వివరాలు ఎక్స్‌క్లూజివ్ గా ఉన్నాయి. ఇప్పటికే మొదటి జాబితా రెడీ చేసింది బీజేపీ అధిష్టానం. తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలు సూచించిన పేర్లను సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. నలుగురితో తొలి జాబితా... మరికాసేపట్లో నలుగురు అభ్యర్థులతో తొలి జాబితాను బీజేపీ అధిష్టానం ప్రకటించనుంది. నలుగురు సిట్టింగ్ ఎంపీలకు సీట్లు ఖరారు అయినట్లు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్‌లో తెలంగాణ అభ్యర్థులపై 15 నిమిషాల పాటు చర్చ జరిగింది. * సికింద్రాబాద్ నుంచి కిషన్‌రెడ్డి. * కరీంనగర్- బండి సంజయ్. * నిజామాబాద్- ధర్మపురి అర్వింద్. * ఆదిలాబాద్ టికెట్ సోయం బాపురావుకు దాదాపు బీజేపీ హైకమాండ్ ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈటలకు ఇక్కట్లు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి ఈటల రాజేందర్ కు (Etela Rajender) ఫలితాలు ఊహించని షాక్ ఇచ్చాయి. రెండు స్థానాల్లో ఓటమి చెందారు ఈటల రాజేందర్. అయితే.. లోక్ సభ ఎన్నికల్లో తనకు బీజేపీ హైకమాండ్ టికెట్ ఇస్తుందని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. దేశంలో అతి పెద్ద పార్లమెంట్ స్థానమైన మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. అయితే.. బీజేపీ ప్రకటించే తొలి జాబితాలో ఈటలకు చోటు దక్కేలా లేనట్లు కనిపిస్తోంది. మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ పై బీజేపీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పక్కకు పెట్టినట్లు సమాచారం. ఇకనైనా ఈటలకు బీజేపీలో ఇక్కట్లు తప్పవా? అంటూ ఆయన ఫ్యాన్స్ చర్చలు జరుపుతున్నారు. Also Read: హనుమాన్ ఓటీటీ రిలీజ్ డేట్ అదే.. అందుకోసమే ఆరోజు! #bjp #bandi-sanjay #lok-sabha-elections #kishan-reddy #telangana-bjp-mp-candidates మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి