MLA KTR: త్వరలో బీజేపీలోకి రేవంత్.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. లోక్ సభ ఎన్నికల తరువాత సీఎం రేవంత్ రెడ్డి మరో ఏక్‌నాథ్ షిండే అవుతారని జోస్యం చెప్పారు. త్వరలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకొని రేవంత్ బీజేపీలో కలుస్తారని ఆరోపించారు.

New Update
MLA KTR: త్వరలో బీజేపీలోకి రేవంత్.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

MLA KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల తరువాత సీఎం రేవంత్ రెడ్డి మరో ఏక్‌నాథ్ షిండే, హేమంత్ బిస్వా అవుతారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలో కలుస్తారని సంచలన ఆరోపణలు చేశారు. పాలమూరు కాంగ్రెస్ ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ తమ పార్టీ పై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. రేవంత్ పక్కనే మానవబాంబులు ఉన్నాయని అన్నారు.

ALSO READ: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు రేవంత్ సర్కార్ షాక్

సీఎం అయ్యాక రేవంత్ రెడ్డికి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైందని పేర్కొన్నారు. రేవంత్ వచ్చే ఐదు ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. ఎన్నికల సమయం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అబద్దాలు చెప్పు రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని మండిపడ్డారు. తెలంగాణలో వచ్చిన కరువు కాంగ్రెస్ తెచ్చిందే అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కరువు రాకుండా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారని పేర్కొన్నారు. కేసీఆర్ పైన ఉన్న కోపాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై తీర్చుకుంటుందని మండిపడ్డారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కాపీ కొట్టిందని పేర్కొన్నారు.

బండికి కేటీఆర్ సవాల్..

కరీంనగర్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కు మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. కరీంనగర్ అభివృద్ధిపై తమతో చర్చకు రావాలని బండి సంజయ్ కు ఛాలెంజ్ చేశారు. గత ఐదేళ్లలో ఎంపీగా ఉండి కరీంనగర్ కు నువ్వు ఏం చేశావో.. పదేళ్లు తెలంగాణలో అధికారంలో ఉండి మేము ఎంత అభివృద్ధి చేశామో చర్చకు సిద్ధమా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కరీంనగర్ కామన్ దగ్గరకు చర్చకు వస్తావా?. టైం చెప్పు.. బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్ వస్తారని అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు