Kadiyam Srihari: లోక్ సభ ఎన్నికల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నేతల రాజీనామాలతో మెల్లిగా ఖాళీ అవుతున్న బీఆర్ఎస్ పార్టీకి మరో నేత రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో ఆయన టచ్‌లో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా వార్త కథనాలు వస్తున్నాయి. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై కడియం శ్రీహరి స్పందించకపోవడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరినట్లైంది.
నన్ను మంత్రి చేయాలి..
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరేందుకు కడియం శ్రీహరి సీఎం రేవంత్ రెడ్డితో ఒక ఒప్పందం పెట్టుకున్నట్లు సమాచారం. అదేంటంటే రానున్న లోక్ సభ ఎన్నికల్లో తన కూతురు కావ్యకు ఎంపీ టికెట్ ఇవ్వాలని.. అంటిఘే కాకుండా రేవంత్ మంత్రి వర్గంలో తనకు చోటు ఇవ్వాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది. తనను మంత్రిని చేస్తే తన క్యాడర్ తో కలిసి పార్టీలో చేరుతానని హామీ ఇచ్చనట్లు తెలుస్తోంది. కడియం డిమాండ్లను విన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఆయన చెప్పిన విషయాలను కాంగ్రెస్ హైకమాండ్ కు తెలిపారు. త్వరలోనే దీనిపై కాంగ్రెస్ పెద్దలు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ALSO READ: బీజేపీలోకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే
తలపట్టుకున్న కడియం..
కాంగ్రెస్ చేరాలని స్థానిక నేతల నుంచి కూడా కడియంపై ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లోకి వెళ్లాలని జడ్పీటీసీలు, ఎంపీపీలు, మాజీ సర్పంచుల ఆయన్ను ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. కూతురుకు ఎంపీ టికెట్ హామీ కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. కడియంకు మంత్రి పదవి విషయంలో సందిగ్ధత నెలకొంది. పార్టీలో తగిన ప్రాధాన్యత ఉంటుందని కాంగ్రెస్ సంకేతాలు ఇస్తున్నట్లు సమాచారం. పార్టీ మారే విషయంలో కడియం శ్రీహరి ఎటూ తేల్చుకోలేక తలపట్టుకున్నారని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ నేతల్లో చర్చ జోరందుకుంది.