DK Aruna: లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే 195 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ అధిష్టానం విడుదల చేసింది. ఈ క్రమంలో తెలంగాణ నుంచి పార్లమెంట్ ఎన్నికలో బరిలోకి దిగే తొమ్మది మంది అభ్యర్థులను ప్రకటించింది. సికింద్రాబాద్ అభ్యర్థిగా కిషన్ రెడ్డి, కరీంనగర్ అభ్యర్థిగా బండి సంజయ్, నిజామాబాద్ అభ్యర్థిగా ధర్మపురి అర్వింద్, జహీరాబాద్ అభ్యర్థిగా బీబీ పాటిల్, నాగర్ కర్నూల్ అభ్యర్థిగా భారత్, భువనగిరి అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్, చేవెళ్ల అభ్యర్థిగా కొండ విశ్వేశ్వర రెడ్డి, హైదరాబాద్ అభ్యర్థిగా మాధవీలత, మల్కాజ్‌గిరి అభ్యర్థిగా ఈటల రాజేందర్ పేర్లను ప్రకటించింది.
ALSO READ: బీఆర్ఎస్ మాజీ మంత్రి మిస్సింగ్?
డీకే అరుణకు బిగ్ షాక్..
లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటనలో తన పేరు ఉంటుందని భావించిన తెలంగాణ బీజేపీ ఉపాధ్యకురాలు డీకే అరుణకు ఊహించని షాక్ ఇచ్చింది బీజేపీ. మొదటి జాబితాలో ఆమె పేరును ప్రకటించలేదు. మహబూబ్‌నగర్ ఎంపీ టికెట్‌పై తనకే వస్తుందని భారీ ఆశలు పెట్టుకున్నారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనతో డీకే అరుణ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుకుంది. తాజాగా తొలి జాబితాలో డీకే అరుణ పేరు లేకపోవడంతో ఆమె ఆశలు ఆవిరి అయ్యాయి.
ఒక్క టికెట్.. ముగ్గురు పోటీ..
బీజేపీ నుంచి ముగ్గురు ముఖ్యనేతలు మహబూబ్‌నగర్ టికెట్ ఆశిస్తున్నారు. డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, బండారు శాంతి కుమార్ ఈ ఎంపీ టికెట్ రేసులో ఉన్నారు. త్రిముఖ పోటీ ఉండటంతో బీజేపీ హైకమాండ్ సీటు ప్రకటనను పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. మరి వీరిలో బీజేపీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందనే ఉత్కంఠ జహీరాబాద్ ప్రజల్లో నెలకొంది. మరోవైపు బీజేపీ ఫస్ట్ లిస్ట్‌లో సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావుకు షాక్ తగిలింది. ఆయన పేరు కూడా మొదటి జాబితాలో లేదు. మలి విడతలోనూ ఛాన్స్ ఉండకపోవచ్చంటున్న పార్టీ వర్గాలు చెబుతున్నాయి.