Rahul Gandhi To Contest From Raebareli: యూపీలో కాంగ్రెస్ కు కంచుకోటలాంటి స్థానాలు అయిన రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలకు ఇంతకు ముందు వరకు అభర్థులను ప్రకటించలేదు. నామినేషన్లకు ఈరోజు లాస్ట్ డేట్. దీంతో ఇక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. దానికి తెర దించుతూ అమేధీ, రాయ్‌బరేలీ స్థానాలకు అభ్యర్ధులను ఈరోజు ఉదయాన్నే ప్రకటించింది కాంగ్రెస్.గురువారం సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అభ్యర్థులను ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. కానీ అర్థరాత్రి వరకు హై టెన్షన్ కొనసాగుతూనే ఉంది. అయితే ఆయన తన అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్ అధిష్టానం ఇంత ఆలస్యం ఎందుకు చేస్తుందో ఎవరికీ తెలియలేదు. మొత్తానికి ఎట్టకేలకు అందరి ఊహలకు కళ్ళెం వేస్తూ అమేధీ నుంచి రాహుల్ గాంధీ, రాయ్‌బరేలీ నుంచి కేఎల్. శర్మ పోటీకి దిగుతారని కాంగ్రెస్ అనౌన్స్ చేసింది.
రాయ్‌బరేలీ నుంచి రాహుల్ రంగంలోకి దిగుతారని కాంగ్రెస్ వర్గాలు ముందు నుంచి అనుకుంటున్నాయి. అయితే ముందు ఇక్కడ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ సోనియా ప్లేస్ లో కుమారుడు రాహుల్ రంగంలోకి దిగాడు. ఇంకో స్థానం అయిన అమేథీలో ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. ఈ ప్రచారమే జోరుగా సాగింది. కానీ ఆ స్థానంలోకి పార్టీ సీనియర్ నాయకుడు కేఎల్ శర్మను రంగంలోకి దించారు.
సోనియాగాంధీ ఈసారి ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరంగా ఉన్నారు. ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో రాయ్‌బరేలీ స్థానం ఖాళీ అయింది. అయితే సోనియా స్థానంలోకి కుమార్తె ప్రియాంక రావొచ్చని వార్తలు వచ్చాయి. కానీ చివరికి రాహులే ఇక్కడ నుంచి పోటీకి దిగుతున్నారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు.. గాంధీ కుటుంబానికి వీర విధేయుడు కేఎల్. శర్మను అమేథీ (Kishori Lal Sharma from Amethi) నుంచి బరిలోకి దించింది.
రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలకు మే 20న పోలింగ్ జరగనుంది. ఇక ఈ రెండు స్థానాలకు శుక్రవారం నామినేషన్‌కు చివరి రోజు. అయినా కూడా ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో కార్యకర్తలు అయోమయం.. గందరగోళానికి గురయ్యారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఉభయసభల్లో తల్లి, కొడుకు ఉన్నారు. ఇప్పుడు ప్రియాంక కూడా బరిలోకి దిగితే.. బీజేపీ నుంచి విమర్శలు ఎదుర్కోవల్సి వస్తుందన్న భావనతోనే ప్రియాంక వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. గాంధీ కుటుంబంపై బీజేపీ నుంచి విమర్శలు రాకూడదన్న భావనతోనే ప్రియాంక పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
గాంధీ-నెహ్రూ కుటుంబ సభ్యులు అనేక దశాబ్దాలుగా ఈ స్థానాలకు ప్రాతినిధ్యం వహించినందున అమేథీ, రాయ్‌బరేలీ కాంగ్రెస్ కు కంచుకోటగా మారాయి. రాయ్‌బరేలీ నుంచి సోనియా గాంధీ 2004 నుంచి 2024 వరకు ప్రాతినిధ్యం వహించారు. అంతకుముందు సోనియా గాంధీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, అమేథీ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 1999లో మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రస్తుతం ప్రతిపక్ష కూటమి 'ఇండియా'లో ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ (SP)తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. దీంతో యూపీలోని 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక ఐదో దశలో ఈ నెల 20న అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది.
Also read: దెందులూరులో అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు