Telangana news: తెలంగాణలో పెను విషాదం..8 మందిపై పిడుగుపాటు

తెలుగు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోన్న విషయం తెలిసింది. భారీ వర్షాల కారణంగా ఏపీ- తెలంగాణలో పలుచోట్ల పిడుగుపాటుకు గురయ్యారు. ఎనిమిది మంది కూలీలు పనుల్లో నిమగ్నమైన ఉండగా పిడుగు పండింది. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

New Update
Bihar Rains: ఘోర విషాదం.. బీహార్‌లో పిడుగుపాటుకు 25మంది మృతి

ఖమ్మం జిల్లా తిరుమలాయపల్లి (మం) దమ్మాయిగూడెంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న 8 మంది కూలీలపై పిడుగు పడింది. మద్ది వీరయ్య మిర్చి, పత్తిచేనులో కూలీలు పనిచేస్తుండగా ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో కూలీలు పక్కనే ఉన్న వేప చెట్టు కిందకు చేరారు. ఇంతలోనే భారీ శబ్దంతో పిడుగు ఒక్కసారిగా పడడంతో 8 మంది కూలీలు పిడుగుపాటుకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పరిస్థితి విషమం ఉండగా.. మిగతా వారికి గాయాలు అయినట్లు తెలిసింది. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ ద్వారా ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఈ ఇద్దరు మహిళలకు ఎలాంటి ప్రమాదంలేదని, ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు సమాచారం. అయితే..మంగళవారం కురిసిన వర్షానికి పిడుగుపడి సంఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కుటుంబాల్లో తీవ్ర విషాదం

ఇదిలా ఉంటే ఏపీలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. గుంటూరు జిల్లాలో మేడికొండూరు మండలం మందపాడులో పొలంలో పిడుగుపడింది. ఈ ఘటనలో సువార్తమ్మ, ప్రభావతి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో.. మందపాడు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ సువార్తమ్మ, ప్రభావతి ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

హెచ్చరించే వ్యవస్థను కలిగి  భారత్‌ 

మనదేశంలో పిడుగుపాటు ఘటనలు ఆందోళనకరంగా మారిన్నాయి. పెద్ద సంఖ్యలో మరణాలతో పాటు.. మౌలిక సదుపాయాల నష్టం జరుగుతోంది. ఈ ముప్పును సమర్థంగా ఎదుర్కోవడానికి మరింత సన్నద్ధత అవసరం ఉందనే చెప్పాలి. వర్షాకాలంలో పిడుగుపాటు సంఘటనలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఏటా ఈ పిడుగుపాటుకు గురై మరణిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏపీలో జరిగిన సంఘటనతో మాత్రం ఇంట్లో విషాదం నెలకొంది. భారీ వర్షాల కారణంగా సామాన్య ప్రజలు ఎలాంటి పనులు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. భారీ వర్షం కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నా.. సొంత పనులకు, కూలి పనులకు వెళ్లి ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇక.. ప్రపంచంలో మెరుపులు పిడుగుల ముప్పును ముందుగానే హెచ్చరించే వ్యవస్థను కలిగి ఉన్న ఐదు దేశాల్లో భారత్‌దేశం ఒకటి. ఈ వ్యవస్థ ఐదు రోజుల ముందుగానే హెచ్చరిస్తోంది. రాబోయే ప్రమాద తీవ్రతను బట్టి 3 గంటల వ్యవధిలోనూ తెలియజేవచ్చు. అయితే ఇది అనేక మంది ప్రాణాలను కాపాడినా.. మన దేశంలో దాదాపు 96 శాతం పిడుగుపాటుగా సంభవించే మరణాలు గ్రామీణ ప్రాంతాల్లోనే నమోదు అవుతున్నాయని వెల్లడిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు