Yoga: అతి ఎప్పుడైనా అనారోగ్యమే.. యోగా విషయంలో ఈ మిస్టేక్స్ చేయవద్దు

ఆరోగ్యానికి యోగా మంచిదే. కానీ అతిగా చేయడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. కొందరు ఉదయం, సాయంత్రం కాకుండా రాత్రి వేళలో యోగా చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు, అసిడిటీ వంటివి వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

New Update
fingerprints Yoga

Yoga

యోగా చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. దీంతో చాలా మంది లిమిట్‌కి మించి ఎక్కువగా యోగా చేస్తుంటారు. అందులోనూ చేయకూడని సమయాల్లో ఎక్కువగా యోగా చేస్తుంటారు. యోగా ఆరోగ్యానికి మంచిదే.. కానీ లిమిట్‌లో చేయాల్సిన టైంలో చేస్తేనే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: IND vs ENG : వాళ్లు లేకుండా ఆడటం కష్టమే.. రాహుల్ ఎమోషనల్ కామెంట్స్!

సమయం కానీ వేళలో చేస్తే..

మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండవచ్చని కొందరు ఎక్కువ సేపు, సమయం కానీ వేళలో చేస్తుంటారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఒక్కసారిగా తెలియని, కష్టమైన ఆసనాలు వేయకూడదు. వీటివల్ల శారీరక సమస్యలు వస్తాయని అంటున్నారు. యోగా చేసేటప్పుడు సరైన ప్రదేశంలో చేయాలి. అంటే బాగా చల్లగా, వేడిగా ఉన్న ప్రాంతాల్లో చేయకూడదు. 

ఇది కూడా చూడండి: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ధ్వంసమైన బ్లాక్ బాక్స్ విదేశాలకు..?

సాధారణ వాతావరణం ఉండి బాగా వెలుతురు వచ్చే ప్రాంతాల్లో యోగా చేయడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు. ఇలా యోగా చేయడం వల్ల మానసిక సమస్యలు తీరిపోతాయి. ఒత్తిడి, ఆందోళన అన్ని తగ్గి హ్యాపీగా ఉంటారు. కొందరికి ఉదయం పూట యోగా చేయడం కుదరకపోతే సాయంత్రం వేళలో చేస్తుంటారు. సాయంత్రం మంచిదే.. కానీ ఎక్కువ సమయం చేయకూడదు.

ఇది కూడా చూడండి: Jagan: 'నేనొస్తే ఆంక్షలెందుకు'.. చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు

ముఖ్యంగా రాత్రి సమయాల్లో అయితే అసలు యోగా చేయకూడదు. కొందరు భోజనం చేసిన తర్వాత యోగా చేస్తుంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తిన్న కొన్ని గంటల తర్వాత మాత్రమే యోగా చేయడం అలవాటు చేసుకోండి.

ఇది కూడా చూడండి: Coriander Seed Water: కొత్తిమీర గింజల నీరు ఒక దివ్యౌషధం. దీని ప్రయోజనాలను తెలుసుకోండి!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. 

Advertisment
Advertisment
తాజా కథనాలు