Diabetes: ప్రపంచ మధుమేహ దినోత్సవం.. ఈ విషయాలు తెలియకపోతే కష్టం..!

ఈ మధ్య మధుమేహం అనేది వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరిలో సాధారణ సమస్యగా మారిపోయింది. అయితే ప్రతీ సంవత్సరం నవంబర్ 14న మధుమేహ దినోత్సవం జరుపుకుంటారు. మధుమేహం గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం.

New Update
world diabetes day

World Diabetes Day November 14

World Diabetes Day : ప్రస్తుత జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా వయసు తో సంబంధం లేకుండా చాలా మంది మధుమేహం, గుండెపోటు, రక్తపోటు వంటి జీవన శైలి వ్యాధులతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మధుమేహం ప్రతి ఒక్కరిలో ఒక సాధారణ జబ్బుగా మారింది. 2021లో అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య (IDF) సంస్థ సుమారు 537 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు తెలిపింది. అంటే ప్రపంచ జనాభాలో 10.5% మంది.  

Also Read :  మెగాస్టార్ మూవీలో ఛాన్స్ మిస్ చేసుకున్న 'పుష్ప' విలన్.. ఏ సినిమానో తెలుసా?

నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవం

అయితే ప్రతీ సంవత్సరం నవంబర్ 14ను మధుమేహ దినోత్సవంగా జరుపుకుంటారు. మధుమేహం గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా మధుమేహం సంబంధించి చాలా మందిలో ఉండే రకరకాల అపోహల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

చక్కర తింటే మధుమేహం వస్తుందా..? 

మధుమేహానికి,  చక్కర తినడం లేదా తినకుండా ఉండడానికి ఎటువంటి సంబంధం లేదు. శరీరంలో ఇన్సులిన్ నిరోధకత కారణంగా మధుమేహం ఏర్పడుతుంది. తరచూ అధిక కేలరీలు కలిగిన ఆహారాలు,  జన్యుపరమైన అంశాలు, జీవన శైలి విధానాలు దీనికి కారణం.కొంతమందిలో మధుమేహం ఊబకాయం, అధిక బరువు సమస్యలకు కూడా దారితీస్తుంది. 

Also Read: కాబోయే కోడలికి అమితాబ్‌ ఉత్తరం..? నిమ్రత్‌ కౌర్ ఎమోషనల్‌!

టైప్ 2 డయాబెటీస్ హానికరమా..? 

చాలా మంది టైప్ 2 డయాబెటీస్ వల్ల టువంటి దుష్ప్రభావాలు ఉండవని అశ్రద్ధ చేస్తుంటారు. కానీ ఇది చాలా పెద్ద తప్పు. టైప్ 2 డయాబెటీస్ పరిస్థితుల్లో కూడా చికిత్స, మందులు, జీవనశైలి,  ఆహారం పట్ల జాగ్రత్తలు చాలా ముఖ్యం. లేదంటే కంటి చూపు కోల్పోవడం, కాళ్లపై గాయాలు, గుండెపోటు, పక్షవాతం వంటి ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉంది. శరీరంలో చక్కర స్థాయిలు మోతాదు మించి మరింత అధికంగా పెరిగినప్పుడు టైప్ 2 డయాబెటీస్ సంభవిస్తుంది. 

పండ్లు తినొచ్చా..? 

అన్ని రకాల పండ్లు మధుమేహ రోగులకు మంచి కాదు. మామిడి, అరటిపండు, పుచ్చకాయ, గ్రేప్స్, చెర్రీస్, పైనాపిల్ వంటి వాటికి దూరంగా ఉండాలి. వీటిలో కార్బ్స్, నేచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ పండ్లకు బదులుగా కివి, ఆరెంజ్, యాపిల్, అవకాడో వంటి వాటిని తీసుకోవచ్చు.  

Also Read :  మీకు క్యాన్సర్‌ వస్తుందో రాదో AI చెప్పేస్తుంది..ఎలాగంటే?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. 

Also Read: బిగ్ బాస్ ఇంట్లోకి యష్మీ ఫాదర్.. ఆ విషయంలో కూతురి కోసం క్షమాపణలు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు