బిగ్ బాస్ ఇంట్లోకి యష్మీ ఫాదర్.. ఆ విషయంలో కూతురి కోసం క్షమాపణలు..! బిగ్ బాస్ లో ఫ్యామిలీ వీక్ మొదలైంది. తాజాగా విడుదలైన ప్రోమోలో యష్మీ ఫాదర్ హౌస్ లోకి వచ్చారు. ప్రోమోలో యష్మి ఫాదర్ ఆమె ఆటకు సంబంధించి మంచి సలహాలు ఇచ్చినట్లుగా కనిపించింది. అలాగే బయట కాస్త నెగెటివ్ అవుతున్నావని కూడా హింట్ ఇచ్చారు. ఈ ప్రోమో మీరూ చూసేయండి. By Archana 13 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update Bigg Boss Telugu 8 షేర్ చేయండి Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతోంది. ఇక బిగ్ బాస్ హౌస్ ప్రేక్షకులు, హౌస్ మేట్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఫ్యామిలీ వీక్ వచ్చేసింది. ఫ్యామిలీ వీక్ లో భాగంగా నిన్నటి ఎపిసోడ్ నబీల్, రోహిని కుటుంబ సభ్యులు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. Also Read: HBD Kamal Haasan: కమల్ హాసన్ కు మాత్రమే సాధ్యమైన ఈ రికార్డుల గురించి తెలుసా? యష్మీ ఫాదర్ ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో కంటెస్టెంట్ యష్మీ ఫాదర్ హౌస్ లోకి రావడం చూపించారు. ప్రోమోలో యష్మీ ఫాదర్ ఆమె ఆటకు సంబంధించి మంచి ఇన్పుట్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే బయట కాస్త నెగెటివ్ అవుతున్నావని.. జాగ్రత్త అని కూడా హింట్ ఇచ్చారు. ఆ తర్వాత మిగతా హౌస్ మేట్స్ అవినాష్, టేస్టీ తేజతో సరదాగా మాట్లాడారు. నా కూతురు ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే.. క్షమించండి అంటూ ఇతర కంటెస్టెంట్స్ కి చెప్పారు. చాలా రోజుల తరువాత ఫ్యామిలీని చూడడంతో యష్మీ ఎమోషనల్ అయ్యింది. Also Read: విష్ణు ప్రియా NTR నటించిన ఆ సూపర్ హిట్ సినిమాలో యాక్ట్ చేసిందట..! మీకు తెలుసా యష్మీ ఎలిమినేషన్ ఇది ఇలా ఉంటే ఈ వారం పృథ్వీ, యష్మీ, టేస్టీ తేజ, విష్ణు ప్రియా, అవినాష్, గౌతమ్ నామినేషన్స్ లో ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో టాక్ ప్రకారం ఈ వారం యష్మీ లేదా టేస్టీ తేజ ఎలిమినేట్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. యష్మీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినప్పటికీ .. నామిషన్స్ ప్రక్రియలో టేస్టీ తేజతో జరిగిన గొడవ కాస్త నెగెటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయినట్లు నెటిజన్లు అనుకుంటున్నారు. Also Read: కాబోయే కోడలికి అమితాబ్ ఉత్తరం..? నిమ్రత్ కౌర్ ఎమోషనల్! Also Read: మాటలకు కొత్త పుంతలు తొక్కించాడు.. టాలీవుడ్ మనసును గెలిచాడు.. మాటల మాంత్రికుడి బర్త్ డే స్పెషల్! #yashmi #big boss 8 telugu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి