కాబోయే కోడలికి అమితాబ్‌ ఉత్తరం..? నిమ్రత్‌ కౌర్ ఎమోషనల్‌!

అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడిపోతున్నారని.. త్వరలోనే నిమ్రత్‌ కౌర్‌ని పెళ్లి చేసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో అమితాబ్ బచ్చన్ నిమ్రత్‌ కౌర్‌ని ప్రశంసిస్తూ రాసిన లేఖ నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటికే అభిషేక్, ఐశ్వర్య వేర్వేరుగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

New Update
amitabh bachchan

amitabh bachchan

Amitabh Bachchan:   గత కొన్నిరోజులుగా అభిషేక్ బచ్చన్, నటి  నిమ్రత్‌ కౌర్‌ పేర్లు నెట్టింట ఎక్కువగా వినిపిస్తున్నాయి. అభిషేక్ ఐశ్వర్య నుంచి విడిపోయి నిమ్రత్ కౌర్‌ని పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో అమితాబ్ బచ్చన్ నిమ్రత్ కౌర్‌ని ప్రశంసిస్తూ రాసిన లేఖ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో అమితాబ్ బచ్చన్ ఇలా రాశారు.. "మనం కలిసింది, మాట్లాడుకుంది చాలా తక్కువ. చివరిగా క్యాడబరీ యాడ్‌ కోసం  కలిసిన సమయంలో కాంప్లిమెంట్ ఇచ్చాను. ఇప్పుడు 'దస్వీ' సినిమాలో నీ నటన అద్భుతంగా ఉంది. నీ హావభావాలుచక్కగా ఉన్నాయి" అంటూ అమితాబ్ లేఖ రాశారు. అయితే ఈ లేకను బిగ్ బి 2022లో నిమృత్‌కి రాశారు. ఇక ఇప్పుడు అభిషేక్- ఐశ్వర్య విడాకుల పుకార్ల వేళ ఈ లేఖ వైరల్ గా మారడం మరో చర్చకు దారితీసింది. 

Also Read: విష్ణు ప్రియా NTR నటించిన ఆ సూపర్ హిట్ సినిమాలో యాక్ట్ చేసిందట..! మీకు తెలుసా

స్పందించని అభిషేక్, ఐశ్వర్య 

అభిషేక్ బచ్చన్, నిమృత్ కౌర్, యామీ గౌతమ్ ప్రధాన పాత్రలలో 2022లో  'దస్వీ' చిత్రంలో నటించారు. ప్రస్తుతం నిమ్రత్ కౌర్ 'సెక్షన్ 84లో' చిత్రంలో నటిస్తోంది. ఇందులో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బెనర్జీ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది ఇలా ఉంటే విడాకుల రూమర్స్ పై  అభిషేక్, ఐశ్వర్య  ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అంతేకాదు పలు ఈవెంట్లలో కూడా ఐశ్వర్య కేవలం కూతురు ఆరాధ్యతో మాత్రమే కనిపించడం నెటిజన్లలో అనేక అభిప్రాయాలకు తెరతీసింది. 

Also Read: HBD Kamal Haasan: కమల్ హాసన్ కు మాత్రమే సాధ్యమైన ఈ రికార్డుల గురించి తెలుసా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు