/rtv/media/media_files/2024/12/01/ljyIkkZKGDyqGujpm0bh.jpg)
ప్రస్తుతం చలి తీవ్రత రోజురోజుకీ పెరుగుతుంది. ఈ సమయంలో చల్లని నీరు స్నానం చేయడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు పెరిగిపోతాయి. కాబట్టి చాలా మంది వేడి నీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే చలికాలంలో స్నానం చేయడానికి ఎక్కువ శాతం మంది గీజర్ వాడుతుంటారు. ప్రస్తుతం వీటి వాడకం బాగా పెరిగిపోయింది.
ఇది కూడా చూడండి: BIG BREAKING: తెలంగాణలో ఆ ఉద్యోగ నోటిఫికేషన్ రద్దు..
బాత్‌రూమ్‌లో వెంటిలేషన్ ఉండేలా..
గీజర్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. బాత్‌రూమ్‌లో గీజర్ ఉంటే తప్పకుండా వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. కొందరి బాత్‌రూమ్‌లు చాలా చిన్నగా ఉంటాయి. దీంతో వెంటిలేషన్ వెళ్లక గీజర్ పేలిపోయే ప్రమాదం కూడా ఉంది. గీజర్ నుంచి కొన్ని విషపూరిత గ్యాస్‌లు లీక్ అవుతుంటాయి. వెంటిలేషన్ ఉంటే బయటకు వెళ్లిపోతాయి. అదే లేకపోతే వాటిని పీల్చి అక్కడే కొందరు మరణించే ప్రమాదం ఉంది. గ్యాస్ గీజర్‌లను వాడేవారు తప్పకుండా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏర్పాటు చేసుకోవాలి.
ఇది కూడా చూడండి: ఇండియాలో బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ ఇవే..?
గీజర్ ఆన్‌లో ఉన్నప్పుడు ఫ్యాన్ కూడా ఆన్‌లోనే ఉండాలి. అప్పుడే దాని నుంచి వచ్చే విషపూరిత వాయువులు బయటకు వెళ్లిపోతాయి. కొందరు ఎన్ని రోజులైనా గీజర్‌కు సర్వీస్ చేయించరు. అప్పుడప్పుడు అయిన గీజర్‌కి సర్వీసింగ్ చేయించండి. దీనివల్ల ప్రమాదాలు తగ్గుతాయి. లేకపోతే ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి గీజర్ విషయంలో అజాగ్రత్తగా ఉండవద్దు.
ఇది కూడా చూడండి: Adani: దాడులు మరింత బలాన్ని ఇస్తాయి..గౌతమ్ అదానీ
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: Fengal Cyclone : తీరాన్ని తాకిన తుపాను..జిల్లాలకు అధికారుల హెచ్చరికలు