Skin Care: శీతాకాలంలో చర్మం పగుళ్లు వస్తున్నాయా.. ఈ చిట్కాలు పాటించండి

శీతాకాలంలో చర్మం పగుళ్లు రాకుండా ఉండాలంటే వాటర్ ఎక్కువగా తాగుతుండాలి. అలాగే చర్మానికి కొబ్బరి, నువ్వుల నూనెతో పాటు పాలు వంటివి అప్లై చేస్తే స్కిన్ పొడిబారకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Skin health

శీతాకాలం ప్రారంభమైంది. ఈ చలికి అనారోగ్య సమస్యలు రావడంతో పాటు చర్మం కూడా దెబ్బతింటుంది. ఎన్ని లోషన్‌లు చర్మానికి అప్లై చేసిన కూడా పగుళ్లు వస్తాయి. అయితే ఈ శీతాకాలంలో చర్మం పగుళ్లు రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. చర్మానికి మాయిశ్చరైజర్ అప్లై చేసిన కూడా కొంత సమయానికే పొడి బారుతుంది. అదే సహజంగా ఉండే చిట్కాలు పాటిస్తే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మరి చర్మం పగుళ్లు రాకుండా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

ఇది కూడా చూడండి: Tenth Class: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల్లో మార్పులు

వాటర్ ఎక్కువగా తాగుతుండాలి..

చలికాలంలో చాలా మంది తక్కువగా నీటిని తాగుతారు. దీనివల్ల చర్మం ఎక్కువగా పొడిగా మారి పగుళ్లు వస్తుంది. కాబట్టి దాహం వేయకపోయిన కూడా ఈ కాలంలో వాటర్ ఎక్కువగా తాగడం వల్ల చర్మం హెల్తీగా ఉంటుంది. అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే కీరదోసను తినడం వల్ల స్కిన్ పొడిబారకుండా ఉంటుంది. 

ఇది కూడా చూడండి: Instant Coffee: ఇన్‌స్టాంట్ కాఫీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

చలికాలంలో చర్మానికి తప్పకుండా మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. వీటి కంటే కొబ్బరి, బాదం, నువ్వుల నూనె చర్మానికి అప్లై చేసిన కూడా పగుళ్లు రాకుండా ఉంటాయి. ఇవే కాకుండా పాలను స్నానం చేసే ముందు చర్మానికి అప్లై చేస్తే తేమగా ఉంటుంది. ఇవే కాకుండా తేనె, పెరుగు ప్యాక్‌ను కూడా చర్మానికి అప్లై చేయడం వల్ల స్కిన్ పగుళ్లు లేకుండా ఉంటుంది. 

ఇది కూడా చూడండి: గేమ్ ఛేంజర్ నుంచి నానా హైరానా లిరికల్ సాంగ్ రిలీజ్

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చూడండి: ఏపీని భయపెట్టిస్తున్న తుపాన్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు