/rtv/media/media_files/2025/02/13/m5f0jwJYOkOfwUkgg3sL.jpg)
valentine tree special
Valentine Tree: ప్రేమికులు తమ ప్రేమ కలకాలం నిలిచిపోవాలని కోరుకుంటారు. అందుకు కోసం ఒకరి పేర్లను ఒకరు గుండెలపై, చేతులపై పచ్చబొట్టుగా వేయించుకుంటారు. మరికొంతమంది చెట్లపై, రాళ్లపై తమ ప్రేమ గుర్తులను పదిలం చేస్తుంటారు. అలాంటి వారి కోసమే అన్నట్లుగా విశాఖపట్నంలోని ఈ 'వాలెంటైన్ ట్రీ' అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చెట్టుపై చెక్కే ప్రతి అక్షరం ఓ అనుభూతి, ఓ ఆనందం! చెప్పలేని భావనలు చెట్టు తొర్రపై,ఆకులపై పేర్లై మిగిలిపోతాయి. గుండె చప్పుడిలా పదిలంగా నిలుస్తాయి.
Also Read: Kiccha Sudeep: హైదరాబాద్ మెట్రోలో హీరో కిచ్చా సుదీప్.. అక్కడ ఏం చేశారో చూడండి?
వాలెంటైన్ ట్రీ..
విశాఖపట్టణం పెద్దవాల్తేరులో ప్రేమికుల కలల గూటిగా నిలిచిన ఈ చెట్టు శాస్త్రీయనామం ‘క్లూసియా రోసియా'. వాడుక భాషలో దీనిని వాలెంటైన్ ట్రీ అని కూడా అంటారు. ప్రేమను ఎప్పటికీ చిరస్థాయిగా నిలిపే ఓ ప్రకృతి అద్భుతం ఈ చెట్టు. ఎన్ని కాలాలు మారినా అక్షరాలు చెట్టు చర్మంలో చిరునవ్వుగా నిలిచి, ప్రతి జంట కథను గుర్తుచేస్తాయి. ప్రేమ మరిచిపోయే వస్తువు కాదని, ప్రేమ నిలిచిపోయే ప్రతిబింబమని ఈ చెట్టు ప్రతి రోజూ మనకి చెబుతుంది. ఈ చెట్టు ఆకులు ఎండి రాలిపోయినా.. ఆ ఆ అక్షరాలు మాత్రం అలాగే భద్రంగా ఉంటాయట. అందుకే ఇది ‘ఆటోగ్రాఫ్ ట్రీ ’గానూ ప్రాచుర్యంలో ఉందని విశాఖపట్నం జీవవైవిధ్య ఉద్యాన వ్యవస్థాపకులు డాక్టర్ రామమూర్తి తెలిపారు.
Also Read: AR Rahman: నోరు తెరిస్తే ఏమౌతుందో తెలిసిందా.. యూట్యూబర్ అల్లాబాడియాకు రెహ్మాన్ చురకలు!