/rtv/media/media_files/2025/02/15/type1diabetes3-115362.jpeg)
సాధారణంగా చాలామంది డయాబెటిస్ వచ్చిందంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం లేదని, ఎక్కువగా స్వీట్లు, వేయించిన ఆహారాలు తినడం వల్ల వచ్చిందనుకుంటారు. చిన్న పిల్లలలో కూడా డయాబెటిస్ సమస్య ఈ రోజుల్లో పెరుగుతోంది. దీనిని టైప్ 1 డయాబెటిస్ అంటారు.
/rtv/media/media_files/2025/02/15/type1diabetes4-313698.jpeg)
ఆహారంతో టైప్ 1 డయాబెటిస్‌కు ఎటువంటి సంబంధం లేదని కొందరు చెబుతున్నారు. వైద్యులు మాత్రం మనం తినే ఆహారం వల్ల టైప్ 1 డయాబెటిస్ వస్తుందని చెప్పలేం అంటున్నారు.
/rtv/media/media_files/2025/02/15/type1diabetes8-876628.jpeg)
టైప్ 1 డయాబెటిస్ అనేది పిల్లలలో వచ్చే ఒక రకమైన డయాబెటిస్. టైప్ 1 డయాబెటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఇది శరీరంలోపల అనారోగ్యం లేదా బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ వల్ల సంభవించవచ్చు.
/rtv/media/media_files/2025/02/15/type1diabetes2-894887.jpeg)
దీనికి మనం తినే ఆహారంతో సంబంధం లేదు. కాబట్టి మనం తినే ఆహారం నుండి అది వస్తుందని చెప్పలేం అంటున్నారు. టైప్ 1 డయాబెటిస్ ఉన్న పిల్లలు చాలా మంది ఉన్నారు.
/rtv/media/media_files/2025/02/15/type1diabetes5-100049.jpeg)
దీనిని ఇన్సులిన్‌తో నియంత్రించవచ్చు, కానీ పూర్తిగా నయం చేయలేమని వైద్యులు చెబుతున్నారు. ఇన్సులిన్, ఆహారం ద్వారా దీనిని నియంత్రించవచ్చని వైద్యులు అంటున్నారు.
/rtv/media/media_files/2025/02/15/type1diabetes1-273797.jpeg)
కొన్ని ఆహార పదార్థాలను దూరం పెట్టడం, పోషకాహారాలు తీసుకోవడంతో పాటు వ్యాయామం ద్వారా కూడా కంట్రోల్లో ఉంచుకోవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు.
/rtv/media/media_files/2025/02/15/type1diabetes7-400962.jpeg)
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.