Thumb Sucking: పిల్లలు బొటనవేలును ఎందుకు చప్పరిస్తారు..? ఏం చేస్తే ఆపేస్తారు?

పిల్లల్లో బొటనవేలు చప్పరించే అలవాటు వల్ల అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. దంతలా అమరిక సరిగ్గా లేకపోవడం, పెదవులు మందంగా మారడం, వేళ్ళల్లో ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు వస్తాయి.

New Update
thumb sucking

thumb sucking

Thumb Sucking: సాధారణంగా కొంతమంది పిల్లలకు బొటనవేలు చప్పరించే అలవాటు ఉంటుంది. ఇలాంటి అలవాటు ఉన్న పిల్లల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. ఈ అలవాట్లు ఎక్కువ కాలం కొనసాగితే పిల్లలో అనేక ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అసలు పిల్లలు బొటన వేలును ఎందుకు చప్పరిస్తారు. దీని వల్ల కలిగే సమస్యలేంటి అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.. 

Also Read: Kiran Abbavaram: తండ్రి కాబోతున్న మరో టాలీవుడ్ హీరో.. సోషల్ మీడియాలో పోస్ట్ !

 బొటనవేలును ఎందుకు చప్పరిస్తారు?

  • కొంతమంది పిల్లలు ఒత్తిడికి గురైనప్పుడు కూడా వారి వేళ్లు, ఇతర వస్తువులను పీలుస్తారు. ఇది ఒత్తిడి నుంచి  ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది.
  • చాలా సందర్భాల్లో  పిల్లలు ఆకలిగా ఉన్నప్పుడు బొటనవేలును పీల్చడం మొదలు పెడతారు .మరికొంతమంది   పిల్లలు తల్లి పాలతో సంతృప్తి చెందనప్పుడు బొటన వేలును నోట్లో పెట్టుకొని చప్పరిస్తారు.  

బొటనవేలు పీల్చడం వల్ల కలిగే నష్టాలు..   

  • సాధారణంగా చాలా మంది పిల్లలు 2 లేదా నాలుగు సంవత్సరాలు వచ్చే ముందు ఈ అలవాటును మనుకుంటారు. కానీ కొంతమంది అదే కొనసాగిస్తారు. 
  • బొటన వేలును అదేపనిగా చప్పరించడం వల్ల గోళ్ల చుట్టూ ఉన్న చర్మానికి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. 
  • అలాగే  దంతాల అమరిక ఉండదు. దీనివల్ల దంతాలు రాలిపోయే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాదు పై పళ్ళు, కింది పళ్ళ మధ్య గ్యాప్‌కు దారితీస్తుంది.
  • బొటనవేలు చప్పరించడం వల్ల  పిల్లల బొటనవేళ్లు సన్నగా, పెదవులు మందంగా మారి కిందికి వేలాడుతూ ఉంటాయి.
  • బొటనవేలు చప్పారించే పిల్లలు తరచూ కడుపు ఇన్ఫెక్షన్లతో బాధపడుతుంటారు. ఎందుకంటే రోజంతా వారు ఆడుతూ ఉంటారు. ఈ క్రమంలో రకరకాల వస్తువులను తాకి అదే చేతులను నోట్లో పెట్టుకుంటారు. దీని వల్ల అనేక క్రిములు వారి కడుపులోకి ప్రవేశిస్తాయి. వేల్లను చప్పరించడం ద్వారా పిల్లల శారీరక ఎదుగుదల కూడా దెబ్బతింటుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: Dil Raju: ఐటీ సోదాల్లో బిగ్ ట్విస్ట్.. దిల్ రాజు సతీమణితో బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయించిన అధికారులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు