/rtv/media/media_files/2025/10/14/molathadu-2025-10-14-08-01-16.jpg)
Molathadu
హిందువులు ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తారు. అయితే కొన్ని ఆచారాలు అనేవి పురాతన కాలం నుంచి పాటిస్తున్నారు. అందులో మొలతాడు ఒకటి. దీన్ని ఆడవారు లేదా మగవారు నడుముకి కట్టుకుంటారు. అయితే మొలతాడు కట్టడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అవేంటో మరి ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Vitamin D: చర్మంతో పాటు పాదాలపై ఈ లక్షణాలు కనిపిస్తే ఆ విటమిన్ లోపమే.. దాన్ని ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి
ఒంటి మీద నూలు పోగు లేకుండా..
దేశంలో కొన్ని ప్రాంతాల్లో అమ్మాయిలు, అబ్బాయిలు కూడా మెలతాడు ధరిస్తారు. అయితే దీనిని ధరించడానికి ఓ కారణం కూడా ఉంది. ఎందుకంటే కొందరు స్నానం చేసేటప్పుడు వివస్త్రలై చేస్తారు. నిజానికి ఇలా అసలు చేయకూడదు. ఒంటి మీద నూలు పోగు ఉండాలి. అప్పుడే ఎలాంటి దుష్ట శక్తులు మిమ్మల్ని తాకవని పండితులు అంటున్నారు. ఈ క్రమంలోనే మొలతాడు తప్పకుండా ఉండాలని చెబుతుంటారు. అలాగే ఈ నడుముకు కట్టుకునే తాడుతో సాక్షాత్తు ఆ ఈశ్వరుడితో సంబంధం ఉంటుందని చెబుతుంటారు. అయితే శరీరం అపవిత్రం కాకుండా ఉండటానికి ఈ మెలతాడు బాగా ఉపయోగపడుతుంది. అలాగే దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
కడుపు బిగుసుగా..
కేవలం హిందువులు మాత్రమే కాకుండా జైనులు, సిక్కులు కూడా దీన్ని ధరిస్తారు. వీటికి కొన్ని పూసలు, తాయత్తులు వంటివి మిక్స్ చేస్తారు. దీనివల్ల ఎలాంటి దిష్టి కూడా తగలకుండా ఉంటుందని పండితులు అంటున్నారు. అయితే మొలతాడు ధరించడం వల్ల సంతానోత్పత్తి శక్తి కూడా పెరుగుతుందని పండితులు అంటున్నారు. దీనివల్ల బరువు కూడా అదుపులో ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఎక్కువగా తింటే మొలతాడు లిమిట్ చెబుతుంది. కడుపు దగ్గర బిగుసుగా మారుతుంది. దీంతో మీరు తక్కువగా తింటారని నిపుణులు అంటున్నారు. ఇది స్టెమ్ సెల్ థెరపీలా కూడా పనిచేస్తుంది. దీనిని ధరించడం వల్ల హెర్నియా కూడా రాదని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కూడా దరిచేరదని, గ్రహ దోషాల నుంచి విముక్తి పొందుతారని నిపుణులు అంటున్నారు. అయితే నలుపు లేదా ఎరుపు రంగు మొలతాడు కట్టుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Night Shift Duty: నైట్ షిఫ్ట్ డ్యూటీ చేస్తున్నారా..? దాని ప్రభావం మీ మూత్ర పిండాలపై పడుతుంది జాగ్రత్త!!