Pumpkin: పొరపాటున వీరు గుమ్మడికాయ తింటే.. ప్రాణాలు గోవిందా!

గుమ్మడి కాయను గర్భిణులు, పాలిచ్చే తల్లులు, కడుపు సంబంధిత సమస్యలు, బీపీ సమస్యలు ఉన్నవారు తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీరు తీసుకోవడం బాడీ డీహైడ్రేట్ అయి సమస్య తీవ్రం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
pumpkin eating

pumpkin eating

గుమ్మడికాయలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మ, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. గుమ్మడిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే గుమ్మడికాయలో ఆల్ఫా-కెరోటిన్, బీటా-కెరోటిన్, బీటా-క్రిప్టోక్సంతిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే గుమ్మడి కాయను కొందరు మాత్రం తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొరపాటున చిన్న ముక్క తిన్నా కూడా ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఎవరెవరు గుమ్మడికాయను తినకూడదో మరి ఈ స్టోరీలో చూద్దాం.

ఇది కూడా చూడండి: Sheikh Hasina: బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు

కడుపు సంబంధిత సమస్యలు

కడుపు ఉబ్బరం, అసిడిటీ, అలెర్జీ వంటి సమస్యలు ఉన్నవారు గుమ్మడి కాయను తినడం వల్ల ఈ సమస్య ఎక్కువ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుమ్మడి కాయ అతిగా తింటే జీర్ణ సమస్యలు పెరుగుతాయి. దీంతో ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: సంచలన అప్‌డేట్‌.. పుతిన్‌ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్‌ బాంబు దాడి !

ఫుడ్ పాయిజనింగ్

గుమ్మడికాయ తినడం వల్ల కొన్నిసార్లు ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ గుమ్మడి కాయ తిన్న తర్వాత వాంతులు, వికారం, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. 

గర్భిణీలు లేదా పాలిచ్చే తల్లులు

గర్భిణీలు లేదా పాలిచ్చే వ్యక్తులు గుమ్మడికాయను తినకూడదు. ఒకవేళ తినాలి అనుకుంటే వైద్యుని సూచనల మేరకు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే బాడీ డీహైడ్రేట్ అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే (VIDEO)

బీపీ సమస్యలు

గుమ్మడి గింజల్లో బీటా కెరోటిన్, మెగ్నీషియం ఉంటాయి. ఇవి రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే బీపీకి మందులు వాడుతున్న వారు గుమ్మడికాయను తినకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు