/rtv/media/media_files/2025/07/29/sravana-masam-reel-ideas-2025-07-29-15-57-24.jpg)
Sravana Masam reel ideas
ఏదైనా పండగ వస్తే చాలు.. సోషల్ మీడియా అంతా దానికి సంబంధించిన వీడియోలు, రీల్స్ తో నిండిపోతుంది. అలా ఇప్పుడు ఎక్కడ చూసిన శ్రావణ మాసం శోభే కనిపిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్, ఫేస్‌బుక్ లో శ్రావణ మాసానికి సంబంధించిన రీల్స్, వీడియోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. మరి ఈ శ్రావణ మాసంలో ఎలాంటి కంటెంట్ చేస్తే మీకు వ్యూస్ వస్తాయి? ఎలాంటి ఐడియాస్ ఫాలో అవ్వాలి? ప్రస్తుతం ఏ కంటెంట్ ట్రెండింగ్‌లో ఉంది అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..
అయితే హిందూ సంప్రదాయాల్లో శ్రావణ మాసం అత్యంత ప్రాముఖ్యత, విశిష్టత కలిగి ఉంటుంది. ఈ మాసంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ప్రజలు శివపూజలు, వరలక్ష్మి వ్రతాలు ఆచరిస్తారు. సోమవారాలు శివుడిని, శుక్రవారాలు లక్ష్మీ దేవిని పూజిస్తారు. నెలంతా మాంసాహారం ముట్టకుండా ఎంతో భక్తి శ్రద్దలతో శివుడిని ప్రార్థించడం ద్వారా సుఖ సంతోషాలు, సంపదను తెచ్చిపెడతాయని నమ్ముతారు.
Also Read : నాగ పంచమి నాడు ఇలా చేస్తే.. లెక్కలేనంత డబ్బు మీ సొంతం
శ్రావణ మాసం రీల్స్, వీడియో ఐడియాస్
- అయితే శ్రావణ మాసంలో పాటించే పూజ విధానాలు, నోములు ఏంటి అనే విషయాలను వీడియో రూపంలో చేసి మీ యూట్యూబ్ లేదా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్స్ లో అప్లోడ్ చేయండి. ఇది చాలా మందికి ఉపయోగపడడంతో పాటు మీకు మంచి వ్యూస్ కూడా వస్తాయి.
- చాలా మందికి వరలక్ష్మి దేవి అలంకరణ, పూజ విధానం గురించి పూర్తిగా అవగాహన ఉండదు. అలంటి వారి కోసం అలంకరణ, పూజ విధానం స్టెప్స్ ని వివరించండి. అలాగే ఎలాంటి నైవేద్యాలను సమర్పించాలి అనేది కూడా వీడియో చేయండి. ఈ కంటెంట్ కి మంచి వ్యూస్ వస్తాయి. లక్ష్మీ దేవి అలంకరణ వీడియోను ఒక షార్ట్ రూపంలో పెడితే వ్యూవర్ కి మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.
- వరలక్ష్మీ వ్రతం రోజు ఇల్లంతా పువ్వులతో డెకరేట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం కొందరు వేలు వేలు ఖర్చు పెడుతుంటారు. కావున ఇలాంటి వారి కోసం సింపుల్ డెకరేషన్ ఐడియాస్ తో వీడియో చేయండి. ఇలాంటి మనీ సేవింగ్ వీడియోలు వ్యువర్స్ ని బాగా అట్రాక్ట్ చేస్తాయి.
- శ్రావణ మాసంలో దేవుడి ప్రసాదంగా ఎలాంటి వంటకాలు చేయాలి అనే వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంటాయి. కావున మీరు కూడా ఇలాంటి వీడియో ట్రై చేయండి. లడ్డూలు, పులిహోర, వడపప్పు, పాయసం, శెనగలు వంటి ప్రసాదాలను సింపుల్ ఎలా చేసుకోవాలో వ్యూవర్స్ కి చెప్పండి. అలాగే టైంలేని వారి కోసం తక్కువ సమయంలో చేసే ప్రసాదాలపై వీడియో చేయండి.
- శ్రావణ మాసంలో పూజలు, వ్రతాలు అంటూ మహిళలు సాంప్రదాయ వస్త్రాలంకారణలో ఎక్కువగా ముస్తాబవుతూ ఉంటారు. కావున శారీ ఐడియాస్, జ్యువెలరీ మ్యాచింగ్, మేకప్ ఐడియాస్ గురించి వీడియో చేయండి. ఇవి మహిళలను బాగా అట్రాక్ట్ చేస్తాయి.
- మంచి శారీ, మ్యాచింగ్ జ్యూవెలరీ వేసుకుంటే సరిపోదు కదా.. దానికి తగ్గ హేయిర్ స్టైలింగ్ కూడా అవసరం! కావున డిఫరెంట్ ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ కి, డిఫరెంట్ హయిర్ స్టైలింగ్ ట్యుటోరియల్ ఐడియాస్ తో వీడియో చేయండి. ఇవి సోషల్ మీడియాలో బిగా ట్రెండ్ అవుతున్నాయి కూడా!
Also Read: Sravana Masam 2025: శ్రావణ మాసంలో మాంసాహారం ఎందుకు మానేయాలి.. ఈ కారణాలు వింటే షాక్ అవుతారు!
latest-telugu-news | human-life-style