/rtv/media/media_files/2025/07/28/naga-panchami-2025-2025-07-28-13-26-59.jpg)
Naga Panchami 2025
హిందు పవిత్రమైన పూజల్లో నాగ పంచమికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ పంచమి (Naga Panchami) నాడు చాలా మంది ఎంతో భక్తితో సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటారు. ముఖ్యంగా మంగళవారం (Tuesday) నాడు ఈ నాగుల పంచమి వచ్చింది. సాధారణంగా ఏవైనా తీరని కోరికలు ఉంటే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని భక్తితో పూజిస్తారు. ఒక ఏడు మంగళవారాల పాటు సుబ్రహ్మణ్య స్వామిని (Lord Subrahmanya Swamy), పూజ, అభిషేకం (Abhishekam) వంటివి చేస్తే కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని నమ్ముతారు. అలాంటిది నాగ పంచమి, మంగళవారం నాడు కలిసి రావడం వల్ల ఇంకా మంచిదని, ఏ కోరికైనా కూడా నెరవేరుతుందని పండితులు అంటున్నారు. అయితే విశిష్టమైన నాగ పంచమి నాడు ఎలాంటి నియమాలు పాటిస్తే కోరిన కోరికలు నెరవేరడంతో పాడు ఐశ్వర్యం సిద్ధిస్తుందో తెలియాలంటే మీరు ఈ స్టోరీపై లుక్కేయాల్సిందే.
ఇది కూడా చూడండి: Naga Panchami 2025: నాగ పంచమి నాడు ఈ వస్తువులను అస్సలు వాడకండి
ఉదయాన్నే నిద్రలేచి ఇలా చేస్తే..
నాగ పంచమి (Naga Panchami) నాడు అదృష్టం, ఐశ్వర్యం కలగాలంటే తప్పకుండా నాగ దేవతను పూజించాలి. ఉదయాన్నే స్నానం చేసి సమీపంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లాలి. అక్కడ పాలు, పసుపు, కుంకుమ, పువ్వులతో పూజ చేయాలి. అలాగే తీపి పదార్థాలు స్వీట్లు, పాయసం వంటివి నైవేద్యంగా పెట్టాలి. ముఖ్యంగా నాగ దేవతకు పాలు, నీరు, పసుపు, కుంకుమతో అభిషేకం చేయించాలి. అభిషేకం చేసిన తర్వాత తినకుండా రోజంతా ఉపవాసం ఆచరించాలి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు అయితే పండ్లు, పాలు వంటివి తీసుకోవాలి. లేదా పండ్ల రసాలు వంటివి తీసుకున్నా కూడా మంచిది. ఆఖలికి తట్టుకోలేక ఆహారం తీసుకుంటే మాత్రం పూజ చేసిన ప్రతిఫలం ఉండదని పండితులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Shiva Puja: శివునితోపాటు సోమవారం ఏ దేవతలను పూజించాలో తెలుసా..?
రోజంతా ఉండలేమని అనుకునే వారు సూర్యాస్తమయం తర్వాత ఆహారం తీసుకోవచ్చు. అలాగే ఉపవాసం ఆచరించే వారు సర్ప స్తోత్ర పారాయణం వంటివి చేయాలి. వీలైన వారు రాహు కేతువులకు కూడా పూజలు నిర్వహించాలని చెబుతున్నారు. ఈ పంచమి నాడు (Naga Panchami) పూజలు, ఉపవాసాలతో పాటు దాన ధర్మాలు కూడా చేయాలని పండితులు చెబుతున్నారు. పేద వారికి నల్ల నువ్వులు, ఆవాల నూనె, నల్లటి వస్త్రాలు వంటివి దానం చేయడం వల్ల తప్పులు అన్ని కూడా తొలగిపోతాయి. అలాగే ఇంట్లో ఉన్న సమస్యలు తీరిపోయి.. ఐశ్వర్యం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు. నాగ దేవతల ఆశీస్సుల వల్ల అదృష్టం, శ్రేయస్సు కలుగుతాయని పండితులు అంటున్నారు.
ఇది కూడా చూడండి:Shivalingam: శివలింగంపై వెండి పాడగలను ఎందుకు సమర్పిస్తారో తెలుసా.?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చూడండి: Fasting: ఉపవాసం అంటే ఆకలితో ఉండటం కాదు..? నిజమైన అర్థం ఏమిటో తెలుసా?