శబరిమల వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. కొందరు రైళ్లలో పూజలు చేస్తున్నారని ఇలా చేయకూడదని తెలిపింది. రైళ్ల కోచ్‌లో భక్తులు కర్పూరం వెలిగించడం, హారతి ఇవ్వడం, అగరబత్తులు వెలిగించడం, సాంబ్రాణి పెట్టడం వంటివి చేయవద్దని కోరింది. రైళ్లలో ఇలాంటి పూజలు నిర్వహించడం వల్ల ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదం అని తెలిపింది.
ఇది కూడా చూడండి: అయ్యప్ప భక్తులకు అలర్ట్..భారీ వర్షాలతో క్లోజ్ అయిన పెద్ద పాదం మార్గం!
ఇది కూడా చూడండి: హరీష్ రావుకు బిగ్ షాక్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ వారెంట్!?
జైలు శిక్షతో పాటు..
ఇలా చేయడం వల్ల రైల్వే ఆస్తులకు కూడా నష్టం కలిగించినట్లు అవుతుందని తెలిపింది. ఇలా చేస్తే రైల్వే చట్టంలోని 1989 సెక్షన్‌లోని 67, 154, 164, 165 ప్రకారం నేరంగా భావించి శిక్ష విధిస్తారని తెలిపింది. మూడు ఏళ్ల పాటు జైలు శిక్ష విధించడంతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే శాఖ తెలిపింది.
ఇది కూడా చూడండి: Ganja:ఈ చాక్లెట్లు తింటే సకల రోగాలు మటు మాయం.. తనిఖీల్లో సంచలన నిజాలు!
శబరిమల భక్తుల సౌకర్యం మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. సికింద్రాబాద్, హైదరాబాద్, కాకినాడ, కాచిగూడ, తిరుపతి, నాందేడ్ వంటి స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లను తీసుకొచ్చింది. ప్రతీ ప్రయాణికుడు తిరిగి గమ్యస్థానానికి చేరుకోవాలంటే ఇలాంటి పనులు రైళ్లలో చేయకూడదని తెలిపింది.
ఇది కూడా చూడండి: YCP నాయకుడి దౌర్జన్యం..నగ్న వీడియోలతో బెదిరించి, 2 ఏళ్లు అత్యాచారం!