/rtv/media/media_files/2025/01/27/IQqKpFjOjn4aPm6XKAza.jpg)
Snake Plant
కాలుష్యం స్థాయి రోజురోజుకి పెరుగుతోంది. దీని కారణంగా ప్రజలు ఆరోగ్య సమస్యలు (Health Problems) ఎదుర్కొంటున్నారు. కాలుష్యాన్ని నివారించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నారు. మొక్కలు గాలిని శుద్ధి చేయడమే కాకుండా ఇంటి వాతావరణాన్ని కూడా రిఫ్రెష్ చేస్తాయి. కాలుష్యాన్ని నివారించేందుకు ఇంట్లో మొక్కలు నాటాలనుకుంటే నర్సరీల నుంచి కొన్ని ప్రత్యేక మొక్కలను తీసుకురండి. కాలుష్యాన్ని నివారించేందుకు ఎన్నో మొక్కలు మంచివి. ఈ మొక్కల గురించి కొన్ని విషయాలు ఈ ఆరిక్టిల్‌లో తెలుసుకుందాం.
Also Read : రాత్రిపూట 2 లవంగాలు తింటే అనేక వ్యాధులు పరార్
కాలుష్యాన్ని తగ్గించడంలో..
వీటిలో స్నేక్ ప్లాంట్, మనీ ప్లాంట్ రాత్రిపూట కూడా ఆక్సిజన్‌ను విడుదల చేస్తూ గాలిని పరిశుభ్రంగా ఉంచుతాయి. స్నేక్ ప్లాంట్ (Snake Plant) ను బ్రీథింగ్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. మనీ ప్లాంట్లు ఇంటి అలంకరణకు మాత్రమే కాకుండా కాలుష్యాన్ని తగ్గించడంలో కూడా సహాయపడతాయి. వాతావరణం చల్లగా ఉంటే వారానికోసారి వీటికి నీళ్లు పోయవచ్చు. ప్రతి 10 రోజులకు ఒకసారి తేలికపాటి సెన్సింగ్ చేయడం కూడా అవసరం.
ఇది కూడా చదవండి: రాత్రిపూట అలోవెరా జెల్‌ని ముఖానికి రాసుకుంటే?
మొక్కను తాజాగా ఉంచడానికి దాని పెరుగుదలకు అవసరమైన గాలిని పొందేలా చూసుకోవాలి. ఈ మొక్కల ధర కూడా చాలా తక్కువగానే ఉంటుంది. మనీ ప్లాంట్ 30 నుంచి 50 రూపాయలకు దొరుకుతుంది. వీటిని ఇంట్లో పెంచడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా అందమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కూడా సృష్టించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Also Read : బరువు తగ్గించడంలో మొక్కజొన్న పిండి బెస్ట్
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: పాలలో ఇవి కలిపి తాగితే మలబద్ధకం శాశ్వతంగా మాయం