Smoking Habit: స్మోకింగ్ అలవాటు ఉన్నవారికి ఇది నిజంగా షాకింగ్ న్యూస్. ఇప్పటివరకు స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరమని మాత్రమే తెలుసు. కానీ తాజాగా జరిగిన పరిశోధనల్లో, ఈ అలవాటు మన ఆయుష్షుపై ఎంతగానో ప్రభావం చూపుతుందని భయంకరమైన నిజాలు వెల్లడయ్యాయి. Also Read: పుష్ప స్టైల్లో నితీశ్ రెడ్డి.. వీడియో చూస్తే గూస్‌బంప్స్ రావాల్సిందే! ధూమపానం చేసే వాళ్లు సిగరెట్ తాగినప్పుడు వచ్చే కిక్కు కోసం ఈ అలవాటును మానడం చాలా కష్టంగా భావిస్తారు. అయితే, ఈ కిక్కు వెనుక ఉన్న ప్రమాదం జీవితానికి చాలా పెద్ద దెబ్బతీస్తుంది. చాలా మంది చైన్ స్మోకర్స్ బాడీ లోపల పార్ట్ లు పోయే రేంజ్ లో స్మోకింగ్ అలవాటు(Smoking Habit) చేసుకుంటారు. కానీ తాజాగా వెలుగు చూసిన నివేదికలు, ఆరోగ్యం పూర్తిగా చెడిపోయిన తర్వాత ధూమపానం మానడం పెద్దగా ప్రయోజనం ఇవ్వదని చెబుతున్నాయి. Also Read: స్టుపిడ్ షాట్.. గెట్‌అవుట్ ఫ్రమ్ డ్రెస్సింగ్ రూమ్: సన్నీ ఫైర్ 20 నిమిషాల లైఫ్ కట్..! సమయానికి స్మోకింగ్ మానేయగలిగితే మాత్రం లైఫ్ టైం మెరుగుపరచుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అద్భుతమైన నిజం ఏమిటంటే, ప్రతి సిగరెట్ తాగినప్పుడు మన ఆయుష్షులో సగటున 20 నిమిషాలు తగ్గుతుందట. ఈ విషయాన్ని పరిశోధనలు స్పష్టంగా నిరూపించాయి. Also Read: Pushpa-2: పుష్ప–2 నిర్మాతలకు భారీ ఊరట–అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు పురుషులు, మహిళలు ఇద్దరూ ఈ అలవాటు బారిన పడుతుండగా, పురుషులలో సిగరెట్ తాగడం జీవనకాలం మీద మరింత తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని నివేదికలు చెబుతున్నాయి. సిగరెట్ తాగడం వల్ల పురుషుడి ఆయుష్షు సగటున 17 నుండి 22 నిమిషాల వరకు తగ్గుతుందని తాజా అధ్యయనాలు పేర్కొన్నాయి. ఈ షాకింగ్ నిజాలు, పొగత్రాగే అలవాటు ఉన్న వారిని మానేందుకు ప్రేరేపించవచ్చు. Also Read: ఆ సమాయానికి మోదీ ప్రభుత్వం ఉండకపోవచ్చు.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు