/rtv/media/media_files/2025/09/07/skin-care-tips-2025-09-07-14-56-20.jpg)
Skin Care Tips
సాధారణంగా ప్రతి ఒక్కరూ అందంగా, యవ్వనంగా కనిపించాలని అనుకుంటారు. కానీ ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా చాలామంది యుక్తవయస్సులోనే వృద్ధాప్య రూపంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే వృద్ధాప్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం అయినప్పటికీ.. కొన్ని ఆహారపు అలవాట్లు మన శరీరం, చర్మ వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తాయి.
ఇదే విషయంపై అమెరికాకు చెందిన 58 ఏళ్ల రివర్స్ ఏజింగ్ నిపుణుడు ఎడ్సన్ బ్రాండావో మాట్లాడుతూ.. మనం ఇష్టపడే కొన్ని సాధారణ ఆహార పదార్థాలు మన చర్మాన్ని దెబ్బతీస్తాయని తెలిపారు. అంతేకాకుండా ముడతలను పెంచుతాయని, అదే సమయంలో శక్తిని తగ్గిస్తాయని తెలిపారు. అనంతరం ఏ ఏ పదార్థాలు మన వృద్ధాప్యాన్ని పెంచుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐస్ క్రీం
ఐస్ క్రీంలో ఎక్కువ చక్కెర, కొవ్వు ఉంటుంది. ఈ రెండూ కలిసినప్పుడు, గ్లైకేషన్ అని పిలువబడే ఒక ఎంజైమ్ ఏర్పడుతుంది. దీని కారణంగా మన చర్మంలో కొల్లాజెన్ వంటి ప్రోటీన్లు బలహీనపడటం ప్రారంభిస్తాయి. ఫలితంగా చర్మం కుంగిపోయి ముడతలు త్వరగా కనిపిస్తాయి. అయితే అప్పుడప్పుడు తినడం మంచిది.. కానీ రోజూ ఐస్ క్రీం తినడం వల్ల ముఖం అందం దెబ్బతింటుంది.
సోడా
ప్రతి ఒక్కరికీ చల్లని సోడా అంటే చాలా ఇష్టం. దీన్ని ఎక్కువగా తాగడానికి ఇష్టపడతారు. కానీ ఇందులో చాలా చక్కెర, ఫాస్పోరిక్ ఆమ్లం ఉంటాయి. ఇది ఎముకల నుండి కాల్షియాన్ని తొలగిస్తుంది. అలాగే దంతాలను దెబ్బతీస్తుంది. అంతే కాకుండా అకస్మాత్తుగా రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. ఇది చర్మాన్ని పొడిగా, అనారోగ్యంగా చేస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా హానికరంగా ఉంటుంది.
పండ్ల రసాలు
చాలా మంది పండ్ల జ్యూస్‌లు ఆరోగ్యకరమైనవి అని అనుకుంటారు. కానీ చాలా వరకు ప్యాక్ చేసిన జ్యూస్‌లలో ఫైబర్ ఉండకుండా.. ఎక్స్‌ట్రా చక్కెర ఉంటుంది. ఫైబర్ లేకపోవడం వల్ల శరీరం ఎక్కువగా చక్కెరను అట్రాక్ట్ చేస్తుంది. ఇది ఇన్సులిన్‌ను పెంచుతుంది.
నకిలీ వెన్న
నకిలీ వెన్నలో గుండె, చర్మం రెండింటికీ చాలా హానికరమైన ట్రాన్స్ ఫ్యాట్‌లు ఉంటాయి. అవి రక్త నాళాలను గట్టిపరుస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను తగ్గించి చర్మాన్ని పొడిగా చేస్తాయి.
కృత్రిమ తీపి పదార్థాలు
ఇవి మంచి బ్యాక్టీరియాను పాడు చేస్తాయి. ఆకలిని పెంచుతాయి. తీపి శరీరాన్ని గందరగోళానికి గురి చేస్తుంది. ఇది జీవక్రియ ఒత్తిడిని పెంచుతుంది. ఇది అకాల వృద్ధాప్యానికి కారణమవుతుంది. తేనె లేదా స్టెవియా వంటి సహజ ఎంపికలను తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది.
ఆల్కహాల్
ఆల్కహాల్ తాగడం వల్ల శరీరం నీటిని కోల్పోతుంది. చర్మానికి అవసరమైన విటమిన్ ఎ తగ్గుతుంది. దీంతో చర్మం పొడిగా, నిర్జీవంగా కనిపిస్తుంది. ఇది కాలేయాన్ని దెబ్బతీస్తుంది. అప్పుడప్పుడు కొద్ది మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవడం మంచిది. కానీ అధికంగా తీసుకోవడం వల్ల అకాల వృద్ధాప్యం వస్తుంది.