/rtv/media/media_files/2025/09/10/solar-eclipse-2025-2025-09-10-14-54-44.jpg)
Solar Eclipse 2025
సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7న ఏర్పడిన విషయం తెలిసిందే . దీనిని ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు తిలకించారు. ఈ సందర్భంగా చంద్రుడు ముదురు ఎరుపు రంగులో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు సెప్టెంబర్ 21న మరో అరుదైన ఖగోళ సంఘటన, సూర్యగ్రహణం సంభవించనుంది. రెండు గ్రహణాల మధ్య కేవలం 15 రోజుల వ్యవధి ఉండటం ఈ సంఘటనల పట్ల ఆసక్తిని మరింత పెంచుతోంది. ఈ సంవత్సరం పితృ పక్ష గ్రహణంతో ప్రారంభమై.. దానితోనే ముగుస్తుండటం జ్యోతిష్యపరంగా కూడా చాలా ముఖ్యమైనదిగా చెబుతున్నారు. ఈ ఏడాదిలో రెండవ చివరి సూర్యగ్రహణం సెప్టెంబర్ 21 ఆదివారం 2025న జరగనుంది. ఈ రోజున భూమిలోని కొన్ని ప్రాంతాలలో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అంటే చంద్రుడు సూర్యుడిలో కొంత భాగాన్ని మాత్రమే కవర్ చేస్తాడు. దీని కారణంగా..సూర్యుడు ఆకాశంలో నెలవంక ఆకారంలో కనిపిస్తాడు. ఖగోళ అద్భుతాల రెండు గ్రహణాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
15 రోజుల వ్యవధిలో రెండు గ్రహణాలు..
ఈ గ్రహణం సెప్టెంబర్ విషువత్తుకు ముందు వస్తున్నంది. దీనిని విషువత్తు గ్రహణం అని కూడా పిలుస్తారు. సంవత్సరానికి రెండుసార్లు, మార్చి, సెప్టెంబర్ నెలలలో.. సూర్యుడు భూమధ్యరేఖకు సరిగ్గా పైన ఉంటాడు. దీనివల్ల భూమి అంతటా పగలు, రాత్రి సమయాలు దాదాపు సమానంగా ఉంటాయి. ఈ గ్రహణాన్ని చూడటానికి అదృష్టవంతులైన దేశాలు న్యూజిలాండ్, తూర్పు ఆస్ట్రేలియా, దక్షిణ పసిఫిక్ లోని కొన్ని భాగాలు. ఈ ప్రాంతాలలో సూర్యోదయం సమయంలో గ్రహణం కనిపిస్తుంది. డ్యునెడిన్ వంటి ప్రాంతాలలో సూర్యుడిలో 72% వరకు కప్పబడుతుంది. అంటార్కిటికాలో దీని ఉత్తమ వీక్షణను చూడవచ్చు. ఈ పాక్షిక సూర్యగ్రహణం భారతదేశం, ఉత్తర అర్ధగోళంలోని చాలా భాగాలలో అస్సలు కనిపించదు. భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా వంటి దేశాల ప్రజలు ఈ గ్రహణంలో ఏ దశను కూడా చూడలేరు.
ఇది కూడా చదవండి: సెప్టెంబర్‌లో ఆ రాశుల వారికి డేంజర్.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్!
అయితే ఈ సూర్యగ్రహణం సెప్టెంబర్ 21న భారత కాలమానం ప్రకారం.. రాత్రి 11 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 3:23 గంటలకు ముగుస్తుంది. ఈ సమయం భారతదేశంలో రాత్రి కావడంతో.. ఈ గ్రహణం ఇక్కడ కనిపించదు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ సూర్యగ్రహణం సమయంలో బుధుడు కన్యారాశిలో ఉంటాడు. ఇది బుధాదిత్య రాజయోగం అనే అద్భుతమైన గ్రహ సమ్మేళనాన్ని సృష్టిస్తుంది. అయితే.. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి.. దీనికి ప్రత్యక్ష ప్రభావం లేదా సూతకం వంటివి ఉండవు. జ్యోతిష్యులు ఈ గ్రహణం కన్య, ఉత్తరా ఫల్గుణి నక్షత్రాలలో సంభవిస్తున్నందున.. ఈ రాశులలో జన్మించిన వారికి ఇది ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని సూచిస్తున్నారు. వారికి ఈ గ్రహణం పరీక్షలు, అవకాశాల కలయికగా ఉంటుంది. ఈ రోజున విమానం అంత పెద్దదైన 2025 క్యూవి9 అనే ఒక గ్రహశకలం భూమికి చాలా దగ్గరగా వెళ్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు, శాస్త్రవేత్తలు దీనిని ప్రతిక్షణం పర్యవేక్షిస్తున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి: nede చంద్రగ్రహణం.. ఈ 5 రాశుల వారికి డేంజర్!