/rtv/media/media_files/2025/09/22/saddula-bathukamma-2025-09-22-17-05-00.jpg)
saddula bathukamma
Saddula Bathukamma: తెలంగాణలో బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. తీరొక్క పూలతో గౌరమ్మను అలంకరించి. ఆడపడుచులంతా సంబరంగా జరుపుకునే పండగ బతుకమ్మ. ప్రతీ సంవత్సరం దసరా పండగకు ముందు నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని తొమ్మిది రోజులు పాటు బతుకమ్మ వేడుకలను జరుపుకుంటారు. ఊరు, వాడ, పల్లె, పట్టణం అంతా ఏకమై జరుపుకునే ఈ వేడుకలు ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. నిన్న మహాలయ అమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఏడాది సద్దల బతుకమ్మ తేదీ విషయంలో ప్రజలకు గందరగోళం నెలకొంది.
సద్దుల బతుకమ్మ ఎప్పుడు..?
కొంతమంది 29 తేదీ అంటుండగా.. మరికొంతమంది 30న అని అంటున్నారు. ఈ రెండు తేదీల్లో సద్దుల బతుకమ్మ ఎప్పుడు అనే దానిపై పండితులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.. అయితే ప్రతీ సారి సద్దుల బతుకమ్మ తెల్లారే లేదా మరునాడు దసరా పండగకు ఉంటుంది. కానీ, ఈ ఏడాది మాత్రం సద్దల బతుకమ్మ 29న ఉండగా.. దసరా అక్టోబర్ 2న వచ్చింది. దీంతో సద్దుల బతుకమ్మకు, దసరాకు మధ్య రెండు రోజులు గ్యాప్ వచ్చింది. దీనివల్ల ప్రజల్లో కన్ఫ్యూజన్ నెలకొంది. సద్దుల బతుకమ్మ 29 లేదా 30నా అనే దాని గురించి పండితులు ఏమంటున్నారో ఇక్కడ తెలుసుకోండి.
అయితే కొన్ని సార్లు తిథి ద్వయాల కారణంగా ఈ గ్యాప్ ఏర్పడుతుందని తెలిపారు. ఒక్కొక్కసారి తిథులు రెండు రోజుల పాటు నివసిస్తాయట. అలా ఈ సంవత్సరం షష్ఠి అనే తిథి రెండు రోజులు (29, 30) ఉండడం ద్వారా ఒక రోజు పెరిగింది. కావున కొంతమంది 30 వ తేదీన సద్దుల బతుకమ్మ చేయాలని అనుకుంటున్నారు. ఇది వారి వారి సంప్రదాయాల ప్రకారం చేస్తున్నప్పటికీ.. పండితుల అభిప్రాయం ప్రకారం.. బతుకమ్మ అనేది ఒక ఆచార పండగ మాత్రమేనని శాస్త్రీయ పండగ కాదని అంటున్నారు. కావున ఏ తిథి, వారం, నక్షత్రంతో సంబంధం లేకుండా 29వ రోజునే సద్దుల బతుకమ్మను నిమజ్జనం చేయవచ్చని చెబుతున్నారు.
బతుకమ్మ పండగ తేదీలు
- మొదటి రోజు ( సెప్టెంబర్ 21): ఎంగిలి పూల బతుకమ్మ
- రెండవ రోజు ( సెప్టెంబర్ 22) : అటుకుల బతుకమ్మ
- మూడవ రోజు ( సెప్టెంబర్ 23): ముద్దపప్పు బతుకమ్మ
- నాల్గవ రోజు ( సెప్టెంబర్ 24): నానే బియ్యం బతుకమ్మ
- ఐదవ రోజు ( సెప్టెంబర్ 25): అట్ల బతుకమ్మ
- ఆరవ రోజు ( సెప్టెంబర్ 26): అలిగిన బతుకమ్మ
- ఏడవ రోజు ( సెప్టెంబర్ 27): వేపాకాయల బతుకమ్మ
- ఎనిమిదవ రోజు ( సెప్టెంబర్ 28): వెన్నముద్దల బతుకమ్మ
- తొమ్మిదవ రోజు ( సెప్టెంబర్ 29) : సద్దుల బతుకమ్మ
ఈ తొమ్మిది రోజుల పాటు తీరొక్క పువ్వులతో బతుకమ్మను ఆలంకరించి మధ్యలో పసుపు ముద్దతో చేసిన గౌరమ్మను ఉంచి భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహిస్తారు. అలాగే తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి రోజుకో నైవేద్యం సమర్పిస్తారు.
o Read: Kantara Chapter-1 Trailer: 'కాంతార చాప్టర్ 1' ట్రైలర్ వచ్చేసింది.. ఈసారి గూస్ బంప్స్ అంతే!